రైలు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మహా సర్కార్
ఔరంగాబాద్ రైలు ప్రమాదంలో మరణించిన వలస కూలీల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా క్రింద మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ప్రకటించినట్లు తెలుస్తుంది . ఈ రోజు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదంలో 19 మంది వలస కార్మికులు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకోవటానికి సాధ్యమయ్యే సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడ్డాయి . క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పీఎం మోడీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర ఆవేదనతో ఉన్నానని ట్వీట్‌లో ప్రధాని చెప్పారు. రైల్వే మంత్రి శ్రీ పియూష్ గోయల్‌తో మాట్లాడానని, ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు .

కార్మికులు మధ్యప్రదేశ్ కు తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్స్ వెంట నడుస్తున్నారు. వారు అలసట కారణంగా రైలు పట్టాలపై పడుకున్నారు. రైళ్ళు తిరగటం లేదని భావించి వారు రైలు పట్టాలపై పడుకున్నారు . మంచి నిద్రలో ఉండగా గూడ్స్ రైలు వారిపై దూసుకుపోయింది . ఇక 19 మంది మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications