వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!
సమాజంలో రోజురోజుకూ మహిళలపై దాష్టీకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా సమాజంలోని కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్న సంఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. దాంతో మహిళలు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి అనేక కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్రలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని అమరావతిలో షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. దాదాపు 180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన ఓ కామాంధుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాలికలపై దాదాపు 350 కు పైగా అశ్లీల వీడియోలు తీసినట్లు విచారణలో తేలింది. నిందితుడు మహమ్మద్ అయాజ్ గా గుర్తించారు. అయితే అతడు గతంలో రాజకీయ పార్టీకి బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా సైట్స్ ద్వారా మైనర్ బాలికలకు ఎర వేయడమే ఇతడి పని.. అలా మాయమాటలతో వారిని లైంగికంగా కోరిక తీర్చుకునేవాడని విచారణలో వెల్లడైంది.

ఇక ఆ మైనర్ బాలికల వీడియోలు తీసి.. వాటితో బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వేధించినట్లు సమాచారం. కొన్ని వీడియోలు ఆన్ లైన్ లో ఇతరులకు షేర్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నిందితుడికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.












Click it and Unblock the Notifications