Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర పాలిత ప్రాంతంగా కర్ణాటక సరిహద్దు..!!

ముంబై: కర్ణాటక- మహారాష్ట్ర మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇదివరకు దాడుల వరకు వెళ్లిందీ అంశం. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. దీనితో బెళగావి సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ వస్తోన్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకున్నా దీనికి తెర పడట్లేదు. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. అయినా ఈ వివాదానికి తెర పడట్లేదు.

 దశాబ్దాల కాలంగా..

దశాబ్దాల కాలంగా..

1957లో రాష్ట్రాల పునర్విభజన సమయంలో తలెత్తిన సరిహద్దు వివాదం ఇది. ఇప్పటికీ ఉద్రిక్తతలకు కారణమౌతోంది. మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉండే బెళగావి కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఆ భూభాగం తమదంటే తమదంటూ పోటీ పడుతున్నాయి. అప్పట్లో మరాఠీ మాట్లాడే ప్రజలు పెద్ద ఎత్తున నివసించే ప్రాంతాలను కర్ణాటకలో విలీనం చేయడం దీనికి కేంద్రబిందువయింది.

 ఆయా ప్రాంతాలన్నీ..

ఆయా ప్రాంతాలన్నీ..

కర్ణాటకలో ఉన్న బెళగావి, నిప్పాణి, కార్వార, బీదర్, భాల్కీతో పాటు 865 మరాఠీ మాట్లాడే గ్రామాలు తమకు చెందుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అప్పటి మహాజన్ కమిషన్ ఆధారంగా ఈ విభజన చోటు చేసుకుంది. ఆ ప్రాంతాలన్నీ తమకే చెందుతాయని, వాటిని తాము స్వాధీనం చేసుకుని తీరుతామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. తమ భూభాగంపై మహారాష్ట్రకు ఎలాంటి హక్కూ లేదని కర్ణాటక చెబుతోంది.

అసెంబ్లీలో తీర్మానం..

అసెంబ్లీలో తీర్మానం..

ఈ వివాదం సుప్రీం కోర్టుకు సైతం చేరింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. అదే సమయంలో- ఆ వివాదాస్పద భూభాగం మొత్తం తమకే చెందుతుందంటూ మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అప్పగించింది.

 యూటీగా..

యూటీగా..

ఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కొత్త డిమాండ్‌ను తెర మీదికి తీసుకొచ్చారు. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో గల ఈ వివాదాస్పద ప్రాంతం మొత్తాన్ని కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనితో సమస్య పరిష్కారమౌతుందని అన్నారు. భాషా, సరిహద్దుకు సంబంధించిన కేసు మాత్రమే కాదని ఆయన అన్నారు. ఈ సమస్యను మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 పరిష్కారం అయ్యేంత వరకు

పరిష్కారం అయ్యేంత వరకు

ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని ఉద్ధవ్ థాకరే గుర్తు చేశారు. అది పరిష్కారం అయ్యేంత వరకు వివాదాస్పద భూమిని కేంద్ర ప్రభుత్వం యూనియన్ టెరిటరీగా ప్రకటించాలని చెప్పారు. వివాదం పరిష్కారమైన తరువాతే దీనిపై ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకోవచ్చని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+