Maharashtra Rains: సీఎం ఠాక్రేకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ -కేంద్రం సహాయంపై భరోసా
నైరుతి రుతుపవనాల ప్రభావం పీక్స్ కు చేరిన దరిమిలా దేశమంతటా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణ, మహారాష్ట్రలో మాత్రం అసాధారణ రీతిలో వానలు పడుతుండటం, ఈ రెండు రాష్ట్రాలు గడిచిన మూడు రోజులుగా వరదతో విలవిల్లాడుతున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైతోపాటు అన్ని ప్రధాన నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో
మహారాష్ట్రలో భారీ వర్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి మహారాష్ట్రకు అవసరమైన సాయాన్ని తప్పకుండా అందిస్తామని సీఎంకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

ముంబైతో సహా పలు జిల్లాలను భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై, థానే, పాల్గర్, కొంకణ్, రత్నగిరి, కొల్హాపూర్ తదితర జిల్లాల్లో రైలు, రోడ్డు సర్వీసులు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వివిధ గ్రామాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

అంతకుముందు, ముంబైలో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అత్యవసర సమావేశం నిర్వహించారు. రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపడంతో సీఎం ఆయా జిల్లాల్లో పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ విభాగాలకు, సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీచేశారు. వరదల నేపథ్యంలో అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications