మహారాష్ట్రలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 18వేల పాజిటివ్ కేసులు, 2 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడింది. తాజాగా, ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 18,105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,43,844కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ వివరాలను వెల్లడించింది.
గత 24 గంటల్లోనే 391 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 25,586కు పెరిగింది. బుధవారం అత్యధికంగా 17,433 కేసులు నమోదవ్వగా.. గురువారం ఆ రికార్డును బ్రేక్ చేసింది.

కాగా, 13,988 మంది రాష్ట్ర వ్యాప్తంగా డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 6.12 లక్షలకు చేరింది. ప్రస్తుతం 2.05 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క ముంబై నగరం నుంచే కొత్తగా 1526 కేసులు వెలుగు చూశాయి. 37 మరణాలు సంభవించాయి. దీంతో ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,095కి చేరగా, మరణాల సంఖ్య 7764కి చేరింది. పుణెలో కొత్తగా 1873 కరోనా కేసులు, 47 మరణాలు సంభవించాయి.
Recommended Video
దేశ వ్యాప్తంగా అత్యధిక కేసులు మహారాష్ట్ర నుంచే ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా 39,26,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,25,947 యాక్టివ్ కేసులున్నాయి. 30,31,685 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 68,559 మరణించారు.












Click it and Unblock the Notifications