పట్టాలు తప్పిన హౌరా మెయిల్ మూడు బోగీలు: అప్రమత్తతో తప్పిన ప్రమాదం
నాసిక్: ఆదివారం తెల్లవారుజామున ముంబై-హౌరా మధ్య ప్రయాణించే రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు.
ముంబై నుంచి హౌరాకు(12809) నాగ్‌పూర్ మీదుగా వెళ్లే ఈ రైలు బయల్దేరిన కొద్దిసేపటికే ఇగత్‌పురి వద్దకు రాగానే ఎస్-12,ఎస్-13, ప్యాంట్రీ కార్ బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందనుకుంటున్నామని చెప్పారు.

వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరమ్మతు చర్యలు ప్రారంభించామని, ఈ ఘటలో ఇప్పటివరకూ ఎవరికీ ప్రాణహాని జరగలేదని చెప్పారు.
ఘటనపై మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామ అని రైల్వే అధికారి తెలిపారు. కాగా, ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే 12 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications