ప్రధాని మోడీతో ఉద్దవ్ థాకరే భేటీ, ఆదిత్య కూడా, మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టాక తొలిసారి..
శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన కుమారుడు, క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరేతోపాటు పెద్దలను కలుస్తోన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్దవ్ థాకరే తొలిసారి ఢిల్లీ వచ్చారు.
సహచర మంత్రి ఆదిత్య థాకరేతో కలిసి ఉద్దవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మోడీతో ఉద్దవ్ థాకరే భేటీ మర్యాదపూర్వకమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసిన శివసేన-బీజేపీ తర్వాత సీఎం సీటు కోసం విభేదించి బయటకొచ్చినా సంగతి తెలిసిందే. తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి 'మహా వికాస్ ఆఘడి' పేరుతో కూటమి ఏర్పాటు చేశారు. దేవంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మంత్రి పదవులు చేపట్టారు.

ప్రధాని మోడీతో సమావేశం తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో సమావేశమవుతారు. తర్వాత యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో మీట్ అవుతారు.. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని శివసేన పార్టీ వర్గాలు తెలియజేశాయి.
मुख्यमंत्री उद्धव बाळासाहेब ठाकरे यांनी आज दिल्ली येथे पंतप्रधान @narendramodi यांची सदिच्छा भेट घेतली. यावेळी पर्यावरण, पर्यटन आणि राजशिष्टाचार मंत्री @AUThackeray उपस्थित होते. pic.twitter.com/39Q8GUZ3KU
— CMO Maharashtra (@CMOMaharashtra) February 21, 2020












Click it and Unblock the Notifications