అద్భుతమే! కరోనా వ్యాక్సిన్ వేసుకున్న మహిళలకు తిరిగొచ్చిన కంటిచూపు
ముంబై: కరోనావైరస్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మరణం వచ్చే అవకాశం తగ్గుతుందని, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, తాజాగా, కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ఓ వృద్ధురాలికి కంటి చూపు రావడం విశేషం.

కంటిచూపు కోల్పోయిన మహిళకు..
ఈ అద్భుత ఘటన మహారాష్ట్రలోని వాషిమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వాషిమ్ జిల్లా బెందర్వాడి గ్రామానికి చెందిన 70 ఏళ్ల మధురాబాయి బిద్వే అనే మహిళకు కంటిశుక్లం సమస్యతో తొమ్మిదేళ్ల క్రితం చూపుకోల్పోయింది. అప్పట్నుంచి ఆమె చీకటి జీవితాన్నే గడుపుతోంది. ఆమె తన బంధువులతో కలిసి రోసడ్ తహసీల్‌లో నివాసముంటోంది. అయితే, కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో మధురాబాయి కూడా బంధువుల సహాయంతో కరోనా వ్యాక్సిన్ వేసుకుంది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక తిరిగొచ్చిన కంటిచూపు
జూన్ 26న వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి 'కోవిషీల్డ్ వ్యాక్సిన్' మొదటి డోసు వేయించుకుంది. ఆ తర్వాత ఆమెకు కంటిచూపు క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. ఇప్పుడు 30-40 శాతం దాకా కంటిచూపు మెరుగుపడిందని మధురాబాయి తెలిపింది.
తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నుంచే తనకు కంటిచూపు మెరుగుపడుతోందని మధురాబాయి ఆనందం వ్యక్తం చేస్తోంది.
Recommended Video

మధురాబాయి బిద్వే జీవితంలో వెలుగు నింపిన కరోనా వ్యాక్సిన్
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజు నుంచే కంటిచూపు రావడంతో మధురాబాయి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన జీవితం చీకటిలోనే ముగుస్తుందనుకున్నానని.. కానీ, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో తన జీవితంలో కొత్త వెలుగు వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, ఏదో జరుగుతుందనే జరుగుతుందనే అపోహలతో ఇప్పటికీ కొందరు వ్యాక్సిన్ వీసుకోకుండా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే కరోనా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 30 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications