మహారాష్ట్ర రాజకీయం-మంత్రుల ఎంపికలో ఫడ్నవీస్ కు నో ఫ్రీ హ్యాండ్-మారిన సమీకరణాలతో
మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటు మొదలుపెట్టి చివరికి బీజేపీతో పొత్తు పెట్టుకుని సీఎం అయిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం .. ఇప్పుడు కేబినెట్ మంత్రుల ఎంపికపై దృష్టిసారించింది. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ కు మాత్రం ఈసారి చిక్కులు తప్పేలా లేవు. ఆయనకు గతంలోలా మంత్రుల ఎంపికలో స్వేచ్ఛ లభించేలా కనిపించడం లేదు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు కౌంటర్ ఇచ్చేందుకు ఏక్ నాథ్ షిండేను వాడుకుని సీఎం చేసిన బీజేపీకి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ రూపంలో డిప్యూటీ సీఎం పదవి తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆయనకు గతంలో బీజేపీ-శివసేన పొత్తు ఉన్నప్పుడు మంత్రుల్ని ఎంపిక చేసే స్వేచ్ఛ ఉండేది. కానీ ఈసారి మాత్రం షిండే ఆయనకు ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఢిల్లీ బీజేపీ పెద్దల్లో ఆందోళన పెరుగుతోంది. షిండే చెప్పినట్లు ఫడ్నవీస్ వినాల్సిన పరిస్ధితులు దాపురించడంతో ఆయనకు కేబినెట్ బెర్తుల ఎంపికలో స్వేచ్ఛ లభించడం లేదని తెలుస్తోంది. ఇది అంతిమంగా బీజేపీకి దెబ్బగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

పార్టీలో ఇతరులకు కూడా అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయం ఉందని, దాని ప్రకారం, కొంతమంది కొత్త ముఖాలు ప్రభుత్వంలోకి రావచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 2014లో ఫడ్నవీస్‌కు శాఖల కేటాయింపులో చాలా ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారు. ఈసారి అది సాధ్యం కాకపోవచ్చని స్వయానా బీజేపీ నేతలే చెప్తున్నారు. ఈసారి సుధీర్ ముంగంటివార్ వంటి నాయకులను పార్టీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నందున హోమ్ పోర్ట్‌ఫోలియో కూడా ఆయనకు వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన బిజెపి నేత చెప్పారు.












Click it and Unblock the Notifications