హోటల్ గదిలో ఉరేసుకుని వ్యాపారవేత్త ఆత్మహత్య

అజయ్ చోర్డియా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు సూసైడ్ నోట్ లభించిందని, ఆ నోట్‌ను తాము పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
చోర్డియా మృతదేహాన్ని పింప్రి ప్రాంతంలోని యశ్వంత్ రావు చవాన్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు చోర్డియాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు.
పూణేలోని పంచశీల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమానిగా 47 ఏళ్ల అజయ్ చోర్డియా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సీపి) అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే వాటా కూడా ఉంది.












Click it and Unblock the Notifications