• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జనం లేక వెలవెలబోయిన మాల్స్, మండే కావడంతో, సెంట్రల్‌లో కనిపించని జనం, తెరవని జీవీకే వన్

|

అన్‌లాక్ 1.0లో భాగంగా దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు తెరచుకున్నాయి. కానీ ప్రజలు మాత్రం షాపింగ్ చేసేందుకో, తినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఫస్ట్ డే షాపింగ్ మాల్స్ తెరచిన.. జనాల నుంచి ఆశించిన స్పందన రాలేదు. వాస్తవానికి మూడు నెలల తర్వాత షాపింగ్ మాల్స్ తెరచుకున్నాయి. కానీ జనం మాత్రం మాల్స్‌కు వెళ్లేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు.

  Unlock 1.0 : Malls Remain Deserted After Reopening

  ఏపీలో ఎల్లుండి నుంచి మరిన్ని సడలింపులు- మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, గుళ్లు... ఏపీలో ఎల్లుండి నుంచి మరిన్ని సడలింపులు- మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, గుళ్లు...

  సారథీ సిటీ క్యాపిటల్‌లో ఇలా..

  సారథీ సిటీ క్యాపిటల్‌లో ఇలా..

  గచ్చిబౌలిలో గల సారథీ సిటీ క్యాపిటల్ మాల్ కొద్దిమంది మాత్రమే కనిపించారు. వారికి సెక్యూరిటీ గార్డులు థర్మల్ చెక్ చేసి.. లోపలికి పంపించారు. తాను కొన్ని దుస్తులను కొనేందుకు ఇక్కడికీ వచ్చానని.. షాపింగ్ పూర్తయ్యాక వెళ్లిపోతానని బంధువులతో కలిసి వచ్చిన ఫాతీమ బేగం తెలిపారు. కానీ ఇక్కడ తినేందుకు ఆందోళనకు గురవుతున్నామని.. ఇంటికెళ్లాకే లంచ్ చేస్తామని పేర్కొన్నారు. పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్‌లో గల సిటీ సెంటర్ మాత్రం జనం లేక బోసిపోయి కనిపించాయి.

  జీవీకే వన్ క్లోజ్

  జీవీకే వన్ క్లోజ్

  మాదాపూర్‌లో గల ఇనార్బిట్ మాల్‌లో సరైన చర్యలు తీసుకున్నారు. మాల్‌లోకి ప్రవేశించేందుకు.. థర్మల్ స్కీనింగ్, పిజికల్ డిస్టన్స్ కంపల్సరీ చేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేస్తామని తెలిపారు. అయితే బంజరాహిల్స్‌లో గల జీవీకే వన్ మాల్ మాత్రం సోమవారం క్లోజ్ చేసి ఉంది. తమ మాల్‌లోకి వచ్చే జనాన్ని సిబ్బంది ఎలా నియంత్రించాలనే అంశంపై డిస్కష్ చేసినట్టు తెలిసింది.

  బుధవారం నుంచి ఓపెన్

  బుధవారం నుంచి ఓపెన్

  ఈ నెల 10వ తేదీ నుంచి మాల్ తెరుస్తామని జీవీకే వన్ వైస్ ప్రెసిడెంట్ పార్థసారథి తెలిపారు. మాల్‌లోకి ప్రవేశించే మార్గం, వెళ్లే మార్గం ఒక్కటే ఉంటుందని చెప్పారు. అలాగే తమ సిబ్బంది విధిగా ఆరోగ్య సేతు యాప్ యూజ్ చేస్తారని తెలిపారు. ఒకవేళ యాప్ యూజ్ చేయనివారు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపారు. ఇదివరకు నాలుగు ప్రవేశ మర్గాలు ఉండేవని.. వాటిని రెండుకు కుదించామని చెప్పారు. లిప్టులో 20 మంది వరకు వెళ్లొచ్చని.. కానీ దానిని ఆరుగురికి పరిమితం చేశామని తెలిపారు. మాస్క్ ధరించాలని.. ఎంట్రీ పాయింట్ వద్ద శానిటైజర్ ఇస్తామని చెప్పారు.

   కర్ణాటకలో సేమ్ సీన్

  కర్ణాటకలో సేమ్ సీన్

  కర్ణాటకలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. షాపింగ్ మాల్ తెరచిన మొదటిరోజు జనం లేక బోసిపోయి కనిపించింది. దీంతోపాటు సోమవారం కావడం మరో రీజన్ అని చెప్పారు. వీక్ డే కావడంతో చాలా మంది పనిలో నిమగ్నమయ్యారని.. మాల్స్ వెళ్లే తీరిక ఎక్కడిది అని ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పుడు వారు అత్యవసరంగా కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఏముంటాయి అని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు కానీ కోసం ఈ-కామర్స్ సైట్లు ఓపెన్ చేశారని తెలిపారు.

  20 మంది మాత్రమే

  20 మంది మాత్రమే

  బెంగళూరులో రద్దీగా ఉండే గరుడ మాల్‌లో 60 శాతం సముదాయాలు తెరచుకున్నాయి. కానీ 20 మంది వినియోగదారులు మాత్రమే రావడం విశేషం. ఇదివరకటి మాదిరిగా కాకుండా... ఒక గేట్ ఎంట్రీ ద్వారా మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడ శరీరం మొత్తం థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. హ్యాండ్ శానిటైజర్లు కూడా ఏర్పాటు చేశారు. వైరస్ వల్ల జనం భయపడిపోతున్నారని.. వ్యాపారం క్రమంగా పుంజుకునే అవకాశం ఉందని గరుడ మాల్ యజమాని ఉదయ్ గరుడాచార్ తెలిపారు.

  English summary
  malls in Hyderabad and Bengaluru threw open in monday their doors to shoppers after nearly three months of remaining closed due to the nationwide lockdown induced by the coronavirus pandemic.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X