మమతా పై బీజేపీ బ్రహ్మాస్త్రం - 2021 రిపీట్ అయ్యేనా, దీదీ రివేంజ్ తీర్చుకుంటారా..!!

బెంగాల్ సీఎం మమతా పై బీజేపీ బ్రహ్మాస్త్రం సంధించింది. గత ఎన్నికల్లో మమతను ఓడించిన ట్రంప్ కార్డునే మళ్లీ ప్రయోగిస్తోంది. ఈ సారి గత ఫలితమే రిపీట్ అవుతుందా... లేక, మమతా వడ్డీ తో సహా తిరిగి వసూలు చేస్తారా అనేది కీలకంగా మారుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగుతున్న వేళ.. మమతా ఎంచుకున్న నియోజకవర్గం.. అక్కడ బీజేపీ అభ్యర్ధి మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కొత్త లెక్కల వేళ .. ఇక్కడ గెలుపు పైన కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.

బంగాల్​ రాజకీయాల్లో మరోసారి హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుధవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భారీ ర్యాలీ మధ్య అలిపుర్ సర్వే భవన్‌కు చేరుకున్న ఆమె, పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ నామినేషన్ సమర్పించారు. కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి ప్రారంభమైన రోడ్‌షోలో మమతా బెనర్జీ సుమారు 800 మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. తన సొంత నియోజకవర్గం కావటంతో పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆమె వెంట హాజరయ్యారు. తాను పుట్టింది, పెరిగింది భవానీపూర్‌లోనేనని, తన జీవితంలో ప్రతీదీ ఇక్కడి నుంచే ప్రారంభం అయినట్లు మమతా గుర్తు చేసారు. భవనాపూర్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీఎంసీకి ఓటు వేయాలని కోరారు. 294 సీట్లలోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించి అతిపెద్ద విజయాన్ని చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

mamata-banerjee-filed-her-nomination-for-the-bhabanipur-assembly-constituency-here-the-details

2021 ఫలితం రిపీట్ అయ్యేనా... మమతా ప్లాన్ ఏంటి

అదే విధంగా ఎన్నికల జాబితాలో అనేక మంది పేర్లను తొలగించడం తనకు బాధ కలిగిస్తోందని, ఓటర్ల తుది జాబితా ఇంకా ఎందుకు విడుదల చేయలేదో అర్థం కావడం లేదని అన్నారు. దీనికి వ్యతిరేకంగా మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. భవానీపూర్ నియోజవర్గం నుంచి మమతా బెనర్జీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి, ఈసారి భవానీపుర్‌లో కూడా ఆమెను ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ పోటీపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నాలుగోసారి పోటీలో ఉన్న మమతా బెనర్జీపై బీజేపీ తమ అభ్యర్థిగా సువేందు అధికారిని పోటీలోకి దింపింది. 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 2021లో నందిగ్రామ్‌లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ భవానీపుర్ ఉపఎన్నికలో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+