Yogi Adityanath : యోగీ ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు ?
ఉత్తర్ ప్రదేశ్ లో మాఫియాపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఆరేళ్ల క్రితం తొలిసారి అధికారంలోకి రాగానే మాఫియా, గ్యాంగ్ స్టర్లపై ఎన్ కౌంటర్లతో విరుచుకుపడిన యోగీ ఆదిత్యనాథ్.. ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఎన్ కౌంటర్ల వివరాలను కూడా పోలీసులు బయటపెట్టారు. అయితే ఆ తర్వాత 24 గంటల్లోనే మాజీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లను ఓ ఆస్పత్రి బయట పోలీసుల సమక్షంలోనే కొందరు కాల్చిచంపారు.
అతీక్, అష్రాఫ్ హత్యల తర్వాత యోగీ ఆదిత్యనాథ్ మరింత స్పీడు పెంచారు. ఓవైపు వీరిద్దరిని చంపిన వారిని అరెస్టు చేసి,ఈ హత్యలపై సిట్ విచారణకు ఆదేశించిన యోగీ.. ఇవాళ ఇకపై మాఫియా ఉండదనే సంకేతాలు ఇచ్చేశారు. ఇదే క్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు బెదిరింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. యోగీని చంపేస్తామంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బెదిరించాడు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు వెంటనే సదరు వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు.

జార్ఖండ్ కు చెందిన అమన్ రాజా అనే వ్యక్తి ఫేస్ బుక్ లో యోగీ ఆదిత్యనాథ్ ను బెదిరిస్తూ ఓ పోస్టు పెట్టాడు. ఇది కాస్తా వైరల్ అవుతుండటంతో గుర్తించిన యూపీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. యోగీ ఆదిత్యనాథ్ ను కూడా కాల్చి చంపుతానని పోస్టు బెట్టిన సదరు వ్యక్తి.. దీని స్క్రీన్ షాట్ ను ట్యాగ్ చేస్తూ యోగీతో పాటు యూపీ డీజీపీకి కూడా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కొత్వాలీ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications