చివరకు చిక్కాడు: ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి అత్యాచారం చేసి, ఆ తర్వాత యువతిని విక్రయించడానికి ప్రయత్నించిన సంఘటన మైసూర్‌లో చోటు చేసుకుంది. దీనిపై సమచారం అందుకున్న మైసూర్ పోలీసులు ఆ వ్యక్తిని బెంగుళూరులో సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం రాజస్థాన్‌కు చెందిన రవి వృత్తి పరంగా లారీ డ్రైవర్. రాజస్థాన్, హర్యానాల నుంచి తరచూ సరుకులు లోడ్ చేసుకొని మైసూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలో మైసూర్-బెంగుళూరు రోడ్డులో ఉన్న టీ కొట్టులో టీ తాగడానికి వచ్చేవాడు.
ఈ క్రమంలో టీ కొట్టు యజమాని కూతురితో పరిచయం పెంచుకున్నాడు. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెకు శారీరకంగా, మానసికంగా దగ్గరయ్యాడు. అంతేకాదు అమ్మాయి ఇంట్లో తన పేరు రఫీ అని వేరొక పేరుతో పరిచయం చేసుకున్నాడు.

గతవారం హర్యానా నుంచి మైసూర్‌లోని నంజనగూడుకు లోడుతో వచ్చి టీ తాగడానికి దిగాడు. అక్కడే నాలుగురోజుల పాటు ఉన్న అతడు సదరు యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో పాటు రాజస్థాన్ రావాలని కోరాడు.
దీంతో అతడి మాటలను నమ్మిన యువతి అతడి వెంట వెళ్లిపోయింది. అతడు యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇదిలా ఉంటే తన కుమార్తె కనిపించడం లేదని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరిపైనన్న అనుమానం ఉందా? అని పోలీసులు అడిగిన ప్రశ్నకుగాను లారీ డ్రైవర్‌పై అనుమానం ఉందని అతని ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఫోన్ నెంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు యువతి హర్యానాలో ఉన్నట్లు గుర్తించి అక్కడి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు యువతిని బెంగళూరుకు తీసుకువచ్చి విక్రయించబోయే ప్రయత్నం చేశాడు. అయితే నిందితుడు సెల్‌ఫోన్‌పై నిఘా ఉంచిన పోలీసులు నిందితుడు బెంగళూరుకు వచ్చినట్లు గుర్తించి మాటు వేసి అతడిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications