పార్లమెంట్ ఆవరణలో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రైల్ భవనం వద్ద ఒంటికి నిప్పంటించుకుని పార్లమెంట్ వైపునకు పరుగులు తీయడం కలకలం రేపింది. తీవ్ర గాయాలపాలైన అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలం వద్ద పోలీసులు పెట్రోల్‌ను గుర్తించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పట్‌కు చెందిన జితేంద్ర అనే వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించాడనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

అయితే, ఘటనా స్థలంలో కాలిపోయిన రెండు పేజీలు లభించినట్లు తెలిసింది. కానీ, అందులో ఏముందనేది తెలియరాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ బందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జితేంద్ర ఆ్మహత్యకు యత్నించడానికి గల కారణాలు తెలుసుకునేలో పోలీసులు నిమగ్నమయ్యారు. తన గ్రామంలో లేదంటే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయనేదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో ఏవైనా కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అతని మానసిక ఆరోగ్యం ఎలా ఉందనేదానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. పార్లమెంటుకు సమీపంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
VIDEO | Visuals of security deployment outside the Parliament where man attempted self-immolation earlier today.
— Press Trust of India (@PTI_News) December 25, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/sfpmxw48MR
తీవ్రమైన ఆలోచనలు వచ్చినప్పుడు కౌన్సెలింగ్ సేవల కోసం
iCALL మెంటల్ హెల్ప్‌లైన్ నంబర్: 9152987821 ను సంప్రదించవచ్చు. సోమమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సహాయకులు అందుబాటులో ఉంటారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications