అమ్మాయిల నగ్న వీడియోలు తీసి..ఇన్ఫోసిస్ ఆఫీస్‌లోనే
దేశంలో మహిళల భద్రత ఆందోళన కలిగిస్తున్న ప్రధాన అంశంగా మారింది. రోజువారీ వేధింపులు, అత్యాచార వార్తలతో పాటు, ఇప్పుడు కార్యాలయాల్లోనూ మహిళలు వేధింపులకు గురవుతున్నారు. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో జరిగిన ఒక ఘటన మహిళల భద్రతపై మరోసారి సవాల్ విసిరింది.
సీక్రెట్ కెమెరాతో ఉద్యోగి దారుణం
ఇన్ఫోసిస్‌లో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్న నగేష్ స్వప్నిల్ మాలి, ఆఫీస్ టాయిలెట్‌లో రహస్య కెమెరా పెట్టి మహిళల వీడియోలు రికార్డు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఒక మహిళా ఉద్యోగి అప్రమత్తతతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె వెంటనే హెచ్ఆర్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ తర్వాత తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి ఫోన్‌లో ఆమె వీడియోను చూసిన సిబ్బంది, స్క్రీన్‌షాట్ తీసుకుని దాన్ని డిలీట్ చేశారు. అయితే, అతడి ఫోన్‌లో దాదాపు 50 వరకు ఇలాంటి వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.

గతంలోనూ ఇలాంటి ఘటనే
గతంలో కూడా ఈ వ్యక్తి వీడియోలు తీస్తుండగా ఒక యువతికి అనుమానం వచ్చి ప్రశ్నించినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పుడు అతను దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన ఫోన్‌లో 50కి పైగా నగ్న వీడియోలు ఉన్నాయని, వాటిని చూస్తూ తాను సంతృప్తి చెందుతానని షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
ఫోరెన్సిక్ విచారణతో మరిన్ని నిజాలు
పోలీసులు నిందితుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు బిడ్డ అయిన స్వప్నిల్ బీఈ చదివి ఇలాంటి నీచమైన పనికి పాల్పడటం తెలిసి అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన కార్యాలయాల్లో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తోంది.












Click it and Unblock the Notifications