నా భార్య " నాగిని ".. నన్ను కాపాడండి !!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రతి నెలా 'సమాధాన్ దివస్' కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. సాధారణంగా భూ వివాదాలు, పౌర సేవలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ అనూహ్యంగా రీసెంట్ గా ఒక వింత ఫిర్యాదు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో తన భార్య నాగినిగా మారుతుందని రాసుకొచ్చాడు. అంతే కాకుండా బుస కొడుతుందని.. భయపెడుతుందని చెప్పడాం హాట్ టాపిక్ గా మారింది.
భార్యపై వింత ఆరోపణ..
సీతాపూర్ జిల్లా, మహమూదాబాద్ తహసీల్‌లోని లోధాసా గ్రామానికి చెందిన మెరాజ్ అనే వ్యక్తి కలెక్టర్‌ను ఆశ్రయించి ఈ విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. అందులో "నా భార్య నసీమున్ రాత్రిపూట అకస్మాత్తుగా నాగినిగా మారిపోతుంది. ఆ రూపంలో ఆమె నాపై బుస కొడుతూ, బెదిరిస్తోంది. ఈ కారణంగా తనను రక్షించాలని ఆయన అధికారులను వేడుకున్నాడు. ఈ విషయంపై తాను గతంలో స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని మెరాజ్ తెలిపాడు.

అయితే "నాగినిగా మారుతున్న భార్య" సమస్యకు పోలీసులు ఎటువంటి పరిష్కారం చూపలేకపోయారని వాపోయాడు. అందుకే చేసేదేమీ లేక, సహాయం కోసం జిల్లా ఉన్నతాధికారి అయిన కలెక్టర్ వద్దకు రావాల్సి వచ్చిందని ఆయన వివరించారు. దీనిపై సీతాపూర్ కలెక్టర్ వెంటనే స్పందించారు. స్థానిక పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం ఫిర్యాదును పక్కన పెట్టకుండా, సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకొని పరిష్కారం చూపాలని కూడా పోలీసులకు సూచించారు.
కాగా మెరాజ్ చేసిన ఈ ఫిర్యాదుతో గ్రామస్తుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖ కూడా దీనిపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది. కొంతమంది ప్రజలు దీనిని కుటుంబ కలహాలు లేదా మూఢ నమ్మకాల ప్రభావం వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సమస్యను కేవలం ఒక 'వింత'గా చూడకుండా, మానసిక సమస్యగా పరిగణించి, అవసరమైతే ఆ దంపతులకు కౌన్సెలింగ్, మానసిక సహాయం అందించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications