దారుణం: కట్నం తేలేదని టాయ్‌లెట్ క్లీనర్ తాగించాడు

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో ఓ ఎంఎన్‌సి కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కె నరేంద్ర బాబు అనే నిందితుడు తన భార్య బిఎన్ షీల(27)ను కట్నం కోసం గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, తన భార్య కుటుంబం నుంచి తనకు కట్నం రాదని నిర్ధారించుకున్న నరేంద్ర బాబు.. ఆమెను ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.
మే 27న నిందితుడు తన భార్యకు ఉరివేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాన్ని ఆమె అడ్డుకోవడంతో ఆమెకు టాయ్‌లెట్ క్లీనర్ తాగించి హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాన్ని కూడా ఆమె ప్రతిఘటించడంతో.. తన కుమారుడికి ఈ క్లీనర్‌ను తాగించి చంపేస్తానని బెదిరింపులకు గురి చేసి ఆమెతో ఓ గ్లాసు క్లీనర్‌ను తాగించాడు.
ఆ తర్వాత మరో గ్లాసులో క్లీనర్‌ను తీసుకొచ్చి బలవంతంగా తాగించాడు. షీల హత్యాయత్నానికి నిందితుడికి అతడి తల్లి, సోదరుడు సహకరించారు. కాగా, షీల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు 108కి సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి జూన్ 8న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు నరేంద్ర బాబు, అతడి తల్లిదండ్రులతోపాటు ఏడుగురిపై సుబ్రహ్మణ్యపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications