రాష్ట్రపతి కోవింద్ నాకు మేనమామ అంటూ విజిటింగ్ కార్డులు వేయించాడు
లక్నో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన మేనమామ అని ఓ వ్యక్తి విజిటింగ్ కార్డులు అచ్చు వేయించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కాన్పూర్‌కు చెందిన పంకజ్ కోవింద్ తన వద్దకు వచ్చే కస్టమర్లకు తన విజిటింగ్ కార్డులు ఇస్తున్నారు.
అందులో తన పేరు పంకజ్ కోవింద్ అని ఉంది. అంతేకాదు, రామ్ నాథ్ కోవింద్ ఫోటో కూడా వేసి, అతని మేనల్లుడిని అంటూ కార్టులో ఉంది.

దీంతో కొందరు వ్యక్తులు అతనికి ఫోన్ చేసి మీరు నిజంగా రాష్ట్రపతి అల్లుడా అని అడుగుతున్నారు. ఆయన తమ బంధువని, లేదంటే అబద్దం చెప్పాల్సిన పని తనకు ఏముందని ఆయన అంటున్నారు. మరోవైపు అసలు రాష్ట్రపతికి అతను ఎవరో కూడా తెలియదని రాష్ట్రపతి భవన్ వర్గాలు చెబుతున్నాయట.












Click it and Unblock the Notifications