అనుమాన పిచాచి: అందర్నీ చంపేశాడు
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య, ఇద్దరు కూతుళ్లను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఒడిశాలోని నయాఘర్ జిల్లాలోని ఓడాగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటపల్లి గ్రామంలో భగీరథీ నాయక్, ప్రతిమ దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు (మైనర్లు) ఉన్నారు. భార్య ప్రతిమ ప్రవర్తన మీద భగీరథ నాయక్ కు అనుమానం వచ్చింది.
ఇదే విషయంలో ఆమెతో నిత్యం గొడవపడేవాడు. బంధువులు అనేక సార్లు నచ్చచెప్పినా ఫలితం లేదు. భార్య చెడుతిరుగుడు తిరుగుతుందని ఆమె మీద కసి పెంచుకున్నాడు. సహనం కొల్పోయిన భగీరథ నాయక్ భార్య, కుమార్తెలను పిలుచుని ఓ పాఠశాలలోకి వెళ్లాడు.

అక్కడ మళ్లీ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సహనం కొల్పోయిన భగీరథీ భార్య ప్రతిమ గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత ఇద్దరు కుమార్తెలను గొంతునులిమి హత్య చేశాడు. చివరికి పోలీసుల ముందు లొంగిపోయాడు.
భగీరథీ నాయక్ ను అరెస్టు చేశామని సరంకుల్ ఎస్ డీపీవో టీకే. రెడ్డి చెప్పారు. ప్రతిమకు ఇంతకు ముందే వివాహం అయ్యిందని, మొదటి భర్తకు ఓ కుమార్తె (పెద్ద కుమార్తె) పుట్టిందని, తరువాత భగీరథీ ప్రతిమను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత ఐదు నెలల కుమార్తె జన్మించిందని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications