ఘోరం: బురఖా ధరించడం లేదని ప్రేమించి పెళ్లాడిన హిందూ యువతి గొంతుకోసి చంపాడు

ముంబై: లవ్-జిహాద్‌కి సంబంధించిన కేసుగా పేర్కొంటున్న ఓ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. హిజాబ్, బురఖా ధరించడానికి, ఇతర ముస్లిం ఆచారాలను అనుసరించడానికి నిరాకరించిందనే నెపంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ యువతిని గొంతు కోసి చంపాడు భర్త.

నిందితుడు మూడు సంవత్సరాల క్రితం వ్యక్తి హిందూ యువతిని వివాహం చేసుకున్నాడు. ముంబైలోని చెంబూర్ తిలక్ నగర్ ప్రాంతంలో ఇక్బాల్ షేక్ అనే నిందితుడు తన భార్య రూపాలి చందన్‌షివే(20)ను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

man murders Hindu wife by slitting her throat for refusing to wear burqa In Mumbai

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్బాల్‌కు రూపాలితో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగిందని, వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. వివాహంత తర్వాత రూపాలీ తన పేరును జరినాగా మార్చుకుంది.

కాగా, కుటుంబ కలహాల నేపథ్యంలో రూపాలీ తన భర్త ఇక్బాల్‌కు దూరంగా ఉంటోంది. భర్త వేధింపులతో కలత చెందిన రూపాలి చివరకు ఇక్బాల్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. తమ బిడ్డను ఇక్బాల్‌కు ఇవ్వడానికి కూడా నిరాకరించింది.

అయితే, రూపాలి బురఖా ధరించడం లేదని, ముస్లిం ఆచారాలను పాటించడం లేదనే కోపం ఇక్బాల్ ఆమెను గొంతుకోసం హతమార్చాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+