వీధికుక్కపై పార్క్ లో అత్యాచారం చేసిన కామాంధుడు; వీడియో వైరల్: వీడు మనిషేనా?

దేశ రాజధాని ఢిల్లీలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల దాడితో ఒక నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సంచలనం సృష్టిస్తున్న క్రమంలోనే, వీధి కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెర పోయేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వీడు మనిషేనా అని ప్రతి ఒక్కరిలోనూ ఆగ్రహానికి కారణమైంది.

వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో

వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో


దేశ రాజధాని ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలో ఒక పార్కులో ఒక వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారం చేస్తూ ఒక కెమెరాకు పట్టుబడ్డాడు. ఈ మొత్తం సంఘటనను వీడియో తీసిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దీనిని పోస్ట్ చేయడంతో, ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది జంతు ప్రేమికులు ఆ వ్యక్తి చేసిన పనికి షాక్ తిన్నారు. నోరు లేని మూగజీవాలపై హింసకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

కేసు నమోదు చేసిన పోలీసులు

ఇక స్థానికులు ఈ ఘటన పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట పట్టించుకొని పోలీసులు ఆపై వీడియో వైరల్ కావటంతో భారతీయ శిక్షాస్మృతి జంతు చట్టంలోని సెక్షన్ 377/11 కింద నిండితుడి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక వీడియో ఆధారంగా నిందితుడు ఎవరు అన్నది గుర్తించి అతనిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం.. మండిపడిన కాంగ్రెస్ నాయకులు

ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం.. మండిపడిన కాంగ్రెస్ నాయకులు


అయితే మొదటి పోలీసులకు సమాచారం అందిస్తే పెద్దగా స్పందించలేదని ఢిల్లీ పోలీసులపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జంతువు పైనే అంత పైసాచికంగా లైంగిక దాడి చేసే వ్యక్తి సమాజంలో ఉంటే ఎంతో హానికరమని, అటువంటి వ్యక్తిని పోలీసులు పట్టించుకోవడం దారుణం అంటున్నారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఏఐసీసీ సభ్యుడు పంఖూరి పాఠక్ దీనిపై మాట్లాడి పోలీసుల కేసు ఎందుకు పెట్టలేదు అంటూ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా,ఈ రాక్షసుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఒక రేపిస్టును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నోరులేని మూగ జీవాలకు న్యాయం చెయ్యలేని చట్టాలు ఎందుకు? నెటిజన్ లు ఫైర్

నోరులేని మూగ జీవాలకు న్యాయం చెయ్యలేని చట్టాలు ఎందుకు? నెటిజన్ లు ఫైర్

ఇక సోషల్ మీడియాలో ఈ ఘటనపై మండిపడుతున్నారు. నోరులేని మూగజీవులకు న్యాయం చేయలేని చట్టాలు ఉండి ఏమి లాభం అంటూ ప్రశ్నిస్తున్నారు. సమాజంలో మానవత్వం రోజుకి దిగజారి పోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్న వ్యక్తుల ఆలోచనలను ఎవరు వ్యతిరేకించడం లేదని ఆకాశం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను నిర్మూలించడానికి, బలహీనంగా ఉన్న జంతు చట్టాలను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ఇది అవమానమని, వ్యవస్థకు సిగ్గుచేటని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+