రాత్రి వారితో గడిపి డబ్బు తీసుకురా: కెనడా ట్రిప్‌కు డబ్బివ్వలేదని ప్రియురాలిపై ఫ్రెండ్స్‌తో రేప్

ముంబై: మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది. తన కెనడా ట్రిప్‌కు డబ్బులు ఇవ్వనందుకు ఓ యువకుడు స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారం చేసిన ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

నిందితుడి పేరు ధరన్ షా. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఇటీవలే జరిగింది. అతను తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పిందని అన్నారు. పెళ్లి కోసం పదేపదే అడగడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పిందని తెలిపారు.

ఫోటోలు, వీడియోలు తీశాడు

ఫోటోలు, వీడియోలు తీశాడు

తాను పెళ్లి చేసుకోమని అతనిని అడిగానని, అప్పటి నుంచి తనను డబ్బులు డిమాండ్ చేసేవాడని బాధితురాలు తెలిపింది. నిందితుడు ముంబైలోని ఓ క్లబ్ ఓనర్ కొడుకు. అక్కడే యువతితో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరు ప్రేమించుకున్నారు. ఆమె ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని చూపించి ఆమె వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, రూ.1 లక్ష బంగారు నగలు తీసుకున్నాడు.

 కెనడా వెళ్లేందుకు డబ్బులు కావాలని

కెనడా వెళ్లేందుకు డబ్బులు కావాలని

కొద్ది రోజుల క్రితం బాధిత యువతికి ఫోన్ చేశాడు. తాను కెనడాకు వెళ్తున్నానని చెప్పాడు. అఖ్కడకు వెళ్లేందుకు తనకు డబ్బులు కావాలని అడిగాడు. తన వద్ద డబ్బు లేదని ఆమె చెప్పింది. తనకు ఎలాగైనా డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇప్పటికే నీకు చాలా ఇచ్చానని, ఇక తన వద్ద లేవని చెప్పింది.

ఫ్రెండ్స్‌తో రాత్రి గడిపి డబ్బు తీసుకురా

ఫ్రెండ్స్‌తో రాత్రి గడిపి డబ్బు తీసుకురా

తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆ యువకుడు తన అసలు రూపం బయటపెట్టాడు. నీ వద్ద డబ్బులు లేకుంటే స్నేహితులతో రాత్రంతా గడపాలని, వారు ఇచ్చే డబ్బు తీసుకు వచ్చి ఇవ్వాలని బెదిరించాడు. లేదంటే తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

స్నేహితులతో కలిసి అత్యాచారం

స్నేహితులతో కలిసి అత్యాచారం

ఆమె కేసు పెట్టడంతో నిందితుడు ఆమెను బెదిరించాడు. కేసు ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడు. ఆమె తగ్గక పోవడంతో నలుగురు స్నేహితులతో కలిసి ఆమె ఉంటున్న ఇంట్లోకి జొరబడ్డాడు. స్నేహితులతో కలిసి ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశాడు. దాడి తర్వాత ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అత్యాచారం, బెదిరింపు, మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+