లవర్‌తో కలిసి భర్తను చంపా: టీవీ రియాల్టీ షోలో లేడీ

శంకర్ మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె తమిళ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆ విషయాన్ని అంగీకరించినట్లు అర్థమవుతోంది. దీంతో పోలీసులు ఆమెను, శంకర్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది.
కళ, విల్లివక్కంలోని సిడ్కో కాలనీకి చెందిన రాధాకృష్ణన్ 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కళ గౌరీ శంకర్‌తో సంబంధం పెట్టుకుంది. రాధాకృష్ణన్ వారి సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. దీంతో వారిద్దరు అతన్ని చంపాలని పథకం వేసుకున్నారు.
రాధాకృష్ణన్‌ను వారు 2010 జులై 17వ తేదీన చంపి అతను గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శంకర్ కళతో తెగదెంపులు చేసుకుని మరో మహిళను పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆమె రియాల్టీ షోలో విషయాన్ని చెప్పేసింది.












Click it and Unblock the Notifications