వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యకు మందులు కొనే స్తోమత లేక రూ. 700కు 2 నెలల కొడుకుని అమ్మేశాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మల్కన్‌గిరి: ఆనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు మందులు కొనే స్తోమత లేక ఒ గిరిజనుడు రెండు నెలలు వయసున్న తన కుమారుడిని రూ. 700లకు అమ్మేసిన సంఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

కోర్కుంద బ్లాక్‌లోని చిత్తపల్లి-2 గ్రామానికి చెందిన సుకురా మదులి, ధుముసీ మదులి అనే నిరుపేద దంపతులు గత ఫిబ్రవరిలో తమ కుమారుడిని సమీపంలోని చిత్తపల్లి-3 గ్రామానికి చెందిన ‘ఆశా' కార్యకర్తకు అప్పగించారని, దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి తమను ఆదేశించారని జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) అధ్యక్షుడు సంజుక్తా ప్రధాన్ వెల్లడించారు.

Man sells 2-month-old son for Rs 700 to buy medicine for wife

కుమారుడిని అమ్మేసిన గిరిజన దంపతులు ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తోన్న పేదరిక నిర్మూలన పథకాల ద్వారా గానీ, ఇందిరా ఆవాస్ యోజన ద్వారా గానీ ఎలాంటి ప్రయోజనం పొందలేదని తమ విచారణలో తేలిందని, అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు మందులు కొనుగోలుచేసే స్తోమత లేకపోవడం వల్లనే కుమారుడిని అమ్మేసినట్లు సకురా సిడబ్ల్యుసికి వివరించాడని ప్రధాన్ పేర్కొన్నారు.

సుకురా దంపతులకు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇంటిని, వేరే ఇతర పథకాల ద్వారా ప్రయోజనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. ప్రస్తుతం వీరి కుమారుడు ‘ఆశా' కార్యకర్త వద్దనే ఉన్నట్లు ప్రధాన్ తెలిపారు.

English summary
Unable to purchase medicine for his sick wife, a tribal man allegedly sold his two-month-old baby boy to a woman for Rs 700 in Malkangiri district of Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X