వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రయాంగిల్ లవ్ స్టోరి: ప్రియురాలి కోసం దొంగగా మారాడు, ట్విస్టిచ్చిన లవర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్: వివాహితతో రమేష్ అనే యువకుడి ప్రేమ కొంప ముంచింది. ఆమెతో కొంత కాలం పాటు సహజీవనం చేసిన ఆ యువకుడికి గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పు ఇబ్బంది కల్గించింది. రూ.40 వేల పరిహరం చెల్లించాలని గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు అయితే ఆ డబ్బులను ఆ యువకుడు సమకూర్చుకొనేలోపుగా ఆ యువతి మరో వ్యక్తితో కలిసి పారిపోయింది. వివాహిత కోసం దొంగగా మారిన రమేష్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకొంది.

రాజస్థాన్‌ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటు చేసుకొంది. పెళ్ళై, భర్త ఉన్న వివాహితతో రమేష్ అనే యువకుడు ప్రేమ వ్యవహరాన్ని కొనసాగించాడు. వివాహం కావడంతో భర్తతో ఇబ్బందులు ఎదురౌతున్నాయని భావించిన రమేష్ ఆ వివాహితతో కలిసి మరో గ్రామానికి వెళ్ళి అక్కడే ఆమెతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.

అయితే తన భార్యతో రమేష్ పక్క గ్రామంలో సహజీవనం చేస్తున్న విషయాన్ని తెలుసుకొన్న వివాహిత భర్త వారిద్దరిని తమ గ్రామానికి తీసుకెళ్ళి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించాడు.

అయితే ఆ పంచాయితీలో గ్రామ పెద్దలు రమేష్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వివాహిత భర్తకు రూ. 40వేలను పరిహరంగా చెల్లించాలని తీర్పు చెప్పారు. ఈ డబ్బులను చెల్లిస్తే వివాహితతో కలిసి సహజీవనం చేయవచ్చని తీర్పు ఇచ్చారు.

 ప్రేమ మోజులో దొంగతనాలు

ప్రేమ మోజులో దొంగతనాలు

రాజస్థాన్‌కు చెందిన రమేష్ వివాహితతతో ప్రేమలో పడ్డాడు. ఆమెను తీసుకొని వేరే గ్రామంలో సహజీవనం చేస్తున్నాడు. అయితే గ్రామ పెద్దల తీర్పు కారణంగా ఆ వివాహిత భర్తకు రూ.40 వేలు చెల్లించేందుకు సిద్దమయ్యారు. ఈ డబ్బును సమకూర్చుకొనేందుకు రమేష్ దొంగతనాలకు పాల్పడ్డాడు. మోటార్ బైక్‌లను దొంగిలించి వాటిని విక్రయించేవాడు. ఈ డబ్బును వివాహిత భర్తకు చెల్లిస్తే ఆమెతో జీవితాంతం సహజీవనం చేయవచ్చని భావించాడు. తనతో పాటు మరో ఇద్దరితో కలిసి బైక్ దొంగతనాలకు రమేష్ పాల్పడ్డాడు.

ట్విస్టిచ్చిన వివాహిత

ట్విస్టిచ్చిన వివాహిత

బైక్‌లను దొంగతనం చేస్తూ రమేష్ డబ్బులను సమకూర్చుకొంటున్నాడు . అదే సమయంలో తనతో సహజీవనం చేస్తున్న వివాహిత ఓ రోజు రమేష్‌కు లేఖ రాసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వివాహం కాకముందు, రమేష్ పరిచయానికి కంటే ముందుగానే తాను మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నానని వివాహిత ఆ లేఖలో పేర్కొంది. తాను అతడితో కలిసి వెళ్ళిపోతున్నట్టు ఆ లేఖలో రాసింది. అతడిని విడిచి ఉండడం ఇష్టం లేకే పారిపోతున్నట్టు వివాహిత ఆ లేఖలో రాసింది.

 పోలీసులకు పట్టుబడ్డ రమేష్

పోలీసులకు పట్టుబడ్డ రమేష్

మోటార్ బైక్ ల దొంగతనాలు చేస్తూ రమేష్ పోలీసులకు పట్టుబడ్డాడు. రమేష్ ఇప్పటివరకు సుమారు 50 బైక్ లను దొంగతనం చేశాడు. వాటిలో 38 బైక్‌లను విక్రయించి సొమ్ము చేసుకొన్నారు. అయితే రమేష్ తో పాటు ఉన్న ఇద్దరు ఎక్కువ మొత్తంలో వాటా తీసుకోవడం వల్ల రూ.40వేలు జమ కాలేదు. కానీ, అదే సమయంలోత పోలీసులకు పట్టుబడ్డాడు.

 రూ.40 వేలు చెల్లించాల్సిందే

రూ.40 వేలు చెల్లించాల్సిందే

వివాహిత భర్తకు రమేష్ రూ. 40 వేలను చెల్లించాల్సిందేనని గ్రామ పెద్దలు చెప్పడంతో ఏం చేయాలో రమేష్‌కు అర్ధం కాలేదు.పోలీసులకు చిక్కడంతో దొంగతనాలు కూడ చేయడానికి వీలు లేకుండా పోయింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయమై రమేష్ ఏం చేస్తారో చూడాలి.

English summary
Twenty-two-year-old Ramesh did not know he will end up paying a huge price for falling in love.The 22-year-old from Rajasthan’s Udaipur fell met a woman a year ago, eloped with her and started living together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X