Exit Polls: మణిపూర్ మరలా కాషాయానిదే !!.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం ఎంతంటే?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక ఫలితాలే తరువాయి. మార్చి 10 ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల ప్రకియ మొత్తం ముగియడంతో అధికార ఫలితాలకంటే ముందుగానే వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరిలో ఉత్కంఠ , ఆసక్తి నెలకొంది. మణిపూర్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 60 . ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంది. మణిపూర్ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రముఖ మీడియా సంస్థలు, ఏజెన్సీ సంస్థలు సర్వేలు నిర్వహించాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి.

 కమలానికే పగ్గాలు.. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్

కమలానికే పగ్గాలు.. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్


మణిపూర్ ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోసారి కమలం వికసిస్తోందని తేలింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టనున్నట్లు తేల్చాయి. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 33-37 సీట్లలో గెలుపోంది అధికారాన్ని మరలా చేజిక్కించుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 12-17 స్థానాలకే పరిమితమై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించనుందని తెలిపింది. అటు ఇతరులు 5-7 సీట్లతో విజయం సాధించనున్నారని తేల్చింది.

ప్రతిపక్షంలో హస్తం.. జన్ కీ బాత్-ఇండియా న్యూస్ సర్వే

ప్రతిపక్షంలో హస్తం.. జన్ కీ బాత్-ఇండియా న్యూస్ సర్వే


అటు జన్ కీ బాత్ - ఇండియా న్యూస్ సర్వే నిర్వహించిన సర్వే ప్రకారం. బీజేపీ 23 నుంచి 25 స్థానాల్లో విజయబావుట ఎగురవేస్తుందని తెలిపింది. కాంగ్రెస్ 10 నుంచి 14 సీట్లను గెలిచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా ఎన్పీపీ 7 నుంచి 8, ఎన్పీఎఫ్ 5నుంచి 7, ఇతరులు 5 నుంచి అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనున్నట్లు జన్ కీ బాత్-ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.

Recommended Video

    Exit Polls 2022: Punjab లో AAP, Arvind Kejriwal మ్యాజిక్ Congress స్థానంలో ఆప్ | Oneindia Telugu
    బీజేపీ - కాంగ్రెస్ ఓట్ల శాతం .. పీపుల్ పల్స్ సర్వే

    బీజేపీ - కాంగ్రెస్ ఓట్ల శాతం .. పీపుల్ పల్స్ సర్వే

    అటు పీపుల్ పల్స్ సర్వే ప్రకారం కూడా బీజేపీదే హవా అని తేల్చింది. ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 25 నుంచి 29 స్థానాలు కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ పార్టీ 17 నుంచి 21 సీట్లు గెలుచుకోనుంది. అదేవిధంగా ఎన్పీపీ 7 నుంచి 11, ఎన్పీఎఫ్ 3 నుంచి 5, ఇతరులు 2 స్థానాలను కైవసం చేసుకోనున్నట్లు సర్వేలో తేలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 33 శాతం, కాంగ్రెస్ పార్టీ 29 శాతం మేర ఓట్లు సాధించనున్నట్లు సర్వేలో తేలినట్లు చెప్పింది. ప్రస్తుత మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం కూడా ఆయనకే మరలా సీఎం పదవిని కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+