మణిపూర్‌లో ఆరుగురు హత్య: సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి, కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మైతీ వర్గానికి చెందిన ఆరుగురిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశారు. వారి మృతదేహాలు లభ్యం కావడంతో ఒక్కసారిగా అలజడి రాజుకుంది. కుకీ ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన వారిలో 8 నెలల చిన్నారితోపాటు ఇద్దరు బాలికలు, మహిళలు ఉండటం గమనార్హం.

తాజా హత్యలకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో మైతీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ముఖ్యమంత్రి నివాసంతోపాటు ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన దిగడంతోపాటు దాడులకు పాల్పడ్డారు. పలువురు ఎమ్మెల్యేల ఇళ్లపైనా ఆందోళనకారులు దాడులు చేశారు.

Manipur Protesters Attack Houses Of CM and 2 Ministers 3 MLAs Curfew Imposed Internet Suspended

ఈ నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్సింగ్, కాంగ్‌పోక్సి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజులపాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కాగా, లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోలో బంద్ ప్రాంతంలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు నిరసన చేపట్టారు.

ఆరుగురిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లో పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎం బీరెన్ సింగ్ ను డిమాండ్ చేశారు. మరోవైపు, కైషామ్ థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే సపం నిషికాంత సింగ్‌ను తిడ్జిమ్ రోడ్‌లోని ఆయన నివాసంలో కలిసేందుకు నిరసనకారులు అక్కడికి వెళ్లారు. అయితే, ఆయన రాష్ట్రంలో లేరని చెప్పడంతో ఎమ్మెల్యేకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయంపై దాడి చేశారు. ఆరుగురి హత్య, దాడుల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో భారీగా భద్రతా దళాలు మోహరించాయి.

ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. కాగా, మణిపూర్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా బలగాలను ఆదేశించింది. జిరిబామ్ జిల్లా నుంచి సాయుధ మిలిటెంట్లు మహిళలు, పిల్లలతో సహా ఆరుగురు పౌరులను అపహరించి చంపినట్లు నివేదికలను అనుసరించి ఈ ఆదేశాలు జారీ చేసింది. హత్యకు గురైన వారి శరీరాలపై తీవ్రమైన గాయాలు ఉండటం గమనార్హం. ఇద్దరి తలలను వేరిచేసి హత్య చేశారు కుకీ ఉగ్రవాదులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+