మన్ కీ బాత్: ఇందిరా గాంధీని గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత దేశానికి ఇందిరా గాంధీ వంటి మహానేత లభించడం ప్రజల అదృష్టమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. అకాశవాణి మాధ్యమంగా తన 37 మన్ కీ బాత్ ప్రసంగంలో ఆయన మాట్లాడారు.

దేశ ప్రజలందరికీ ఛత్‌‍‌పూజ, దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మన్ కీ బాత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్యం, స్వచ్ఛ భారత్‌, యోగా, బాలల దినోత్సవం, ఖాదీ ఫ్యాషన్‌, క్రీడలకు సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు.

Mann ki Baat: Jawans playing vital role in UN peace keeping missions, says PM

జమ్ము కాశ్మీర్‌లోని గురేజ్‌ సెక్టార్‌లోని సైనికులతో కలిసి దీపావళి వేడుకలను చేసుకోవడం మరిచిపోలేని అనుభూతి అని మోడీ పేర్కొన్నారు.

సరిహద్దుల్లో పహారా కాస్తూ నిరంతరం దేశ రక్షణ కోసం ఎనలేని ధైర్యసాహసాలను కనబరుస్తున్న సైనికులకు దేశం సెల్యూట్‌ చేస్తోందని, అటువంటి జవాన్లతో కలిసి దీపావళి చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మోడీ అన్నారు.

ఐరాస శాంతిపరిరక్షణ మిషన్‌లో దాదాపు 18వేల మంది భారతీయ సైనికులు తమ సేవలను అందిస్తున్నారని, శాంతి పరిరక్షణ మిషన్‌ కోసం భారత్‌ నుంచి మహిళా సైనికులు కూడా తమవంతు సాయం చేస్తున్నారని, లైబీరియాలోని ఈ మిషన్‌కు మహిళా సైనికులను పంపించిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందన్నారు.

భారత్‌ ఎప్పుడూ ప్రపంచానికి శాంతి, ఐకమత్యం, సోదరభావం సందేశాలను ఇస్తోందని, భారతదేశం వసుదైక కుటుంబమన్నారు. చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. సరికొత్త భారతదేశానికి వాళ్లే నేతలు అన్నారు.

పిల్లలను ఆరు బయట ప్రదేశాల్లో ఆడుకోవాలని పెద్దలు సూచించారని, నేటి తరం చిన్నారులు ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారని, వాటి నుంచి బయటపడేందుకు యోగా చక్కగా ఉపయోగపడుతోందన్నారు.

ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత బృందానికి నా అభినందనలు అన్నారు. డెన్మార్క్‌ ఓపెన్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌కు తన అభినందనలు అన్నారు. దేశం గర్వపడేలా చేశారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi addressed the nation in the monthly radio programme 'Mann Ki Baat'on Sunday. The programme will begin at 11 am on October 29. This would be the 37th episode of Mann Ki Baat. The programme will also be streamed on the You Tube channels of the Prime Minister's Office, Ministry of Information and Broadcasting and DD News.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి