చల్లని కబురు-ముందుగానే రుతుపవనాలు-మే 27న కేరళను తాకే అవకాశం ఉందన్న ఐఎండీ
ఈ ఏడాది వేసవి తాపంతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే పలకరించబోతున్నాయని తెలిపింది. భారత్ లో అండమాన్ నికోబార్ దీవుల్ని ఈ నెల 15న తాకే రుతుపవనాలు, కేరళను 27 కల్లా తాకుతాయని వెల్లడించింది. ప్రతీ ఏటా జనవరి 1 తర్వాత కేరళను తాకే రుతుపవనాలు నాలుగు రోజులు ముందుగానే కేరళను తాకనుండటంతో జనానికి ఊరట దక్కనుంది.
కేరళలో నైరుతి రుతుపవనాలు మే 27న ప్రారంభమవుతాయని, అంటే దాని సాధారణ తేదీ జూన్ 1 కంటే దాదాపు నాలుగు రోజుల ముందుగానే ప్రారంభమవుతాయని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం 2010 తర్వాత రుతుపవనాలు మే 27 నాటికి దక్షిణాది రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి కానుంది. ఇవాళ విడుదల చేసిన రుతుపవనాల బులెటిన్‌లో ఐఎండీ .. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ ప్రారంభ తేదీ కంటే ముందుగానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో రుతుపవనాలు మే 27న ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇదో శుభవార్త కానుంది.

దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా వచ్చే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ నిన్న వెల్లడించింది. విస్తరించిన అంతర్ ప్రాంతీయ గాలుల కారణంగా దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో సాధారణంగా అండమాన్ కు ఇవి చేరుకునే మే 21కి బదులుగా మే 15నే తాకనున్నాయి.












Click it and Unblock the Notifications