మావోయిస్టుల సంచలన నిర్ణయం.. ఆయుధ విరమణపై తేల్చేశారుగా!
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలు చాలామంది నేలకొరిగారు. మాద్వి హిడ్మా, నంబాల కేశవరావు, మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్, రవి అలియాస్ ఉదయ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ వంటి అగ్ర నేతలు వివిధ ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే సమయంలో చాలామంది మావోయిస్టు కీలక నేతలు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగి పోతున్నారు.
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత
కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకుండా పార్టీ కోసం పని చేస్తామంటున్న మావోయిస్టులను భద్రత దళాలు అంతమొందిస్తున్నారు. మార్చి నెల నాటికి మావోయిస్టుల రహిత దేశంగా భారతదేశాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది.

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్ట్ ల బహిరంగ లేఖ
ఈ నేపథ్యంలో మావోయిస్టులు మూడురాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. ఈ లేఖలో కూంబింగ్ ఆపరేషన్‌ను నిలిపివేస్తే తాము ఆయుధ విరమణ తేదీని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బస్వరాజు ఎన్‌కౌంటర్ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించిన సీసీఎం నిర్ణయం ప్రకారం జోనల్ కమిటీలకు ఈ సూచనలు పంపినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు.
కీలక నిర్ణయం వెల్లడించిన మావోయిస్ట్ లు
మూడు రాష్ట్రాల్లో పోలీస్ ఆపరేషన్లు నిలిపివేయగానే తాము వెంటనే ఆయుధాలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పునరావాస పథకంలో చేరాలని తాము అనుకుంటున్నట్టు తెలిపారు. అయితే లొంగిపోవడానికి మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తమకు సమయం కావాలన్న మావోయిస్ట్ లు
తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, సమిష్టి నిర్ణయానికి కొంత సమయం పడుతుందని, సహచరులను సంప్రదించి సందేశం తెలియజేసే వరకు తమకు సమయం ఇవ్వాలని కోరారు. భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
లొంగిపోయే తేదీ ఏకాభిప్రాయానికి వచ్చాక ప్రకటిస్తాం
ఇక ఈ మూడు జోనల్స్ కు ప్రతినిధిగా ఉన్న అనంత్ పేరుతో విడుదలైన బహిరంగ లేఖలో సహచరులైన సోను దాదా, సతీష్ దాదా కు సమాచారం అందేలా జర్నలిస్టులు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. అలాగే తమ సందేశం సహచరులకు అందేలా కొద్ది రోజులు రేడియో ద్వారా ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ప్రజాప్రతినిధులను, జర్నలిస్టులను కలిసే అవకాశం కూడా ఇస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సహచరులను కూడా కలిసిన తర్వాత లొంగిపోయే తేదీ ప్రకటిస్తామన్నారు
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications