35వేల టన్నుల పాలరాయితో జైన ఆలయం(వీడియో)
కోచ్చి: పునాది దగ్గర నుండి గోపురం వరకు మొత్తం పాలరాయితోనే దేవాలయం నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటి సారి కేరళలోని కోచ్చి నగరంలో పాలరాయితో అతి పెద్ద జైన్ దేవాలయం నిర్మిస్తున్నారు.

శ్రీ ఎర్నాకులం శ్వేతాంబర మూర్తి పుజక్ జైన్ ట్రస్ట్ ఆద్వర్యంలో 2007వ సంవత్సరంలో జైన దేవాలయం నిర్మాణం మొదలు పెట్టారు. అప్పటి నుండి దేవాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాజస్థాన్ నుండి తెప్పించిన 350 టన్నుల ప్రత్యేక మార్బల్స్ దేవాలయం నిర్మాణం కోసం ఉపయోగించారు.
దాదాపు 90 శాతం పూర్తి అయిన ఈ దేవాలయం ఇదే సంవత్సరం సెప్టెంబర్ లో ప్రారంభించనున్నామని ట్రస్ట్ అధ్యక్షుడు మోహన్ దాస్ సీ. జైన్ అంటున్నారు. కేరళలో నివాసం ఉంటున్న జైనుల కోసం ఈ దేవాలయం నిర్మిస్తున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications