భార్యకు ఇష్టం లేని సెక్స్- నేరమా ? కాదా ? సుప్రీంకోర్టు, హైకోర్టుల మధ్య భిన్నాభిప్రాయాలు
పెళ్లి తర్వాత భార్యతో చేసే బలవంతపు సెక్స్ నేరమా కాదా అన్న చర్చ దేశంలో మళ్లీ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం తాజాగా వివిధ హైకోర్టులు ఇస్తున్న తీర్పులే. గతంలో సుప్రీంకోర్టు జేఎస్ వర్మ కమిటీ సిఫార్సుల ఆధారంగా పెళ్లి తర్వాత చేసే బలవంతపు సెక్స్ నేరంగానే నిర్దారిస్తూ తీర్పు ఇచ్చింది. కానీ తాజాగా హైకోర్టులు మాత్రం ఇలాంటి కేసుల్లో నిందితులకు అనుకూలంగా ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలు మరో కొత్త చర్చకు తావిచ్చేలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల్లో సైతం దీనిపై గందరగోళం నెలకొంది

బలవంతపు సెక్స్
మన దేశంలో పెళ్లి తర్వాత భార్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భర్త సెక్స్ చేయాలని ప్రయత్నిస్తే దాన్ని వైవాహిక అత్యాచారంగా పేర్కొంటున్నారు. ఆయితే ఇలాంటి కేసుల్లో భార్యకు ఇష్టం లేకపోయినా అనే పదానికి ఉన్న వివిధ అర్ధాల నేపథ్యంలో వైవాహిక అత్యాచారం అన్న పదానికి అర్ధమే లేకుండా పోతోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు తర్వాత వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భావించిన వారు కూడా ఇప్పుడు హైకోర్టులు ఇస్తున్న తీర్పులతో ఊరట పొందుతున్న పరిస్దితులు దేశంలో ఉన్నాయి.

బలవంతపు సెక్స్ నేరమేనన్న సుప్రీంకోర్టు
భార్యకు ఇష్టం లేకుండా చేసే సెక్స్ ను అత్యాచారంగానే పేర్కొంటూ నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. వైవాహిక అత్యాచారంగా దీన్ని పేర్కొంటూ సాధారణ రేప్ ఘటనల్లో నిందితులకు విధించే శిక్షనే ఇక్కడ భర్తలకు విధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జేఎస్ వర్మ కమిటీ చేసిన సిఫార్సులే. పెళ్లి తర్వాత భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ చేసినంత మాత్రాన అతి కాపురం కిందకు రాదని, అతను నిందితుడు కాకుండా పోయే అవకాశం లేదని జేఎస్ వర్మ కమిటీ గతంలో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇందులో భార్య మనోభావాల్ని అర్ధం చేసుకోకుండా జరిగేది అత్యాచారంగానే సుప్రీంకోర్టు నిర్ధారించింది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా కీలకంగా మారిపోయింది.

విడాకులు ఇవ్వొచ్చన్న కేరళ హైకోర్టు
తన భర్త బలవంతంగా చేసే సెక్స్ ను కారణంగా చూపుతూ ఓ వివాహిత విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా కేరళ హైకోర్టు దీనికి అంగీకరిస్తూ విడాకులు మంజూరు చేసింది. దంపతులకు విడాకులు మంజూరు చేయడానికి బలవంతపు సెక్స్ ను ఓ కారణంగా పరిగణనలోకి తీసుకోవచ్చని కేరళ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును పరోక్షంగా సమర్ధించేలా ఉన్న ఈ తీర్పుపైనా భిన్నాభిప్రాయాలు వినిపించాయి. దీంతో ఇకపై విడాకులు కోరే ప్రతీ భార్యా దీన్నే కారణంగా చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేరళ హైకోర్టు తీర్పుతో భర్తలకు ఇక కష్టాలేనన్న వాదన వినిపించింది.

అక్రమం కాదన్న మహారాష్ట్ర కోర్టు
భార్యకు ఇష్టం లేకపోయినా చేసే సెక్స్ అక్రమమేమీ కాదని మహారాష్ట్రలోని ఓ స్ధానిక కోర్టు తాజాగా స్పష్టం చేసింది. బలవంతంగా భర్త సెక్స్ చేయడం వల్ల తాను పక్షవాతానికి గురైనట్లు భార్య ఆరోపించినా.. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా కోర్టు మాత్రం సదరు భర్తకు అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో భార్యను అత్యాచారం చేసి వేధించి అనారోగ్యం పాలు చేసినందుకు అరెస్టు కావాల్సిన ఆ భర్తకు ఊరట లభించింది. దీంతో వైవాహిక అత్యాచారంపై మళ్లీ చర్చ మొదలైంది. భర్త కాపురంలో భాగంగా చేసే సెక్స్ బలవంతమైనా అది నేరం మాత్రం కాదనేలా ఉన్న ఈ తీర్పుపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

రేప్ ఎప్పుడైనా ఒకటేనన్న గుజరాత్ హైకోర్టు
పెళ్లికి ముందు జరిగే రేప్ కూ, పెళ్లికి తర్వాత జరిగే బలవంతపు సెక్స్ కూ మధ్య తేడా లేదని తాజాగా మరో కేసులో గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. రేప్ ఎప్పుడు జరిగినా రేప్ గానే పరిగణించాలని తెలిపింది. పెళ్లికి ముందు ఓ ఆడపిల్లను రేప్ చేస్తే దానికి ఐపీసీ సెక్షన్ 375 కింద నేరస్తుడిగా పరిగణించవచ్చని, కానీ అదే పెళ్లి చేసుకున్న భార్య తన భర్త బలవంతంగా సెక్స్ చేశాడని ఆరోపిస్తే రేప్ కిందకు రాదని చెప్పడం వల్ల వైవాహిక అత్యాచారాల్ని ప్రోత్సహించినట్లవుతుందని గుజరాత్ హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. దీంతో రేప్ అనేది పెళ్లికి ముందా, తర్వాతా అన్న దానికి పెద్ద తేడా లేదని తేల్చిచెప్పింది. కాబట్టి ఈ తీర్పు కూడా సుప్రీంకోర్టు తీర్పును పరోక్షంగా సమర్ధించేలా ఉంది.
Recommended Video

సుప్రీంకోర్టు ఫైనల్ గా చెప్పిందిదే
సుచితా శ్రీవాస్తవ వర్సెస్ చండీగఢ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు "లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడాన్ని తిరస్కరించే మహిళ యొక్క హక్కు లేదా ప్రత్యామ్నాయంగా గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించాలనే పట్టుదలకు" అండగా నిలిచింది. అత్యాచారం అనేది మహిళపై నేరం మాత్రమే కాదు, ఇది మొత్తం సమాజంపై నేరమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. తద్వారా భారత్ లో మహిళలపై జరిగే నేరాలు పెళ్లితో ముడిపడి లేవని స్పష్టం చేసినట్లయింది. పెళ్లికి ముందు జరిగితేనే రేప్ అని, పెళ్లి తర్వాత జరిగితే కాదని చెప్పే అధికారం ఎవరికీ లేదని అత్యున్నత న్యాయస్ధానం తన తీర్పులో వెల్లడించింది. తద్వారా బలవంతపు సెక్స్ కేసుల్లో భర్తను రేప్ నేరస్తుడిగానూ, భార్యను బాధితురాలిగానే చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications