Marriage: కొత్త పెళ్లికూతురు ఆత్మహత్య, ఇంత వరకు ఫస్ట్ నైట్ జరగలేదు, మ్యాటర్ తో ?
చెన్నై/ టీ నగర్: పెద్దలు అంగీకారంతో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఇద్దరి పెళ్లి చాలా సింపుల్ గా జరింది. వివాహం చేసుకున్న తరువాత భార్య ఐదు రోజులు భర్త ఇంటిలో ఉంది. తరువాత భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది. భార్యను పుట్టింటి నుంచి తన ఇంటికి పిలుచుకుని వెళ్లడానికి భర్త బయలుదేరాడు. తన భర్త ఇంటికి వస్తున్నాడని తెలిసిన భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన 14 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల విచారణలో కొత్త పెళ్లి కొడుకు షాకింగ్ విషయాలు చెప్పడంతో అందరూ హడలిపోయారు.

35 ఏళ్లు అయినా పెళ్లికాలేదు
చెన్నైలోని తాండయూర్ సమీపంలోని తమిళనగర్ లో ప్రకాష్, గౌరీ దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రకాష్, గౌరీ దంపతులకు రేఖా (35) అనే కుమార్తె ఉంది. చెన్నై సిటీలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో రేఖా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నది. ప్రతిరోజు రేఖా ఇంటి నుంచి ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తోంది.

పెళ్లి చెయ్యాలని ప్రయత్నాలు
35 సంవత్సరాలు అయినా రేఖాకు పెళ్లికాలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న రేఖాకు పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు ప్రకాష్, గౌరీ దంపతులు అనేక ప్రయత్నాలు చేశారు. రేఖా చాలా లావుగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇంతకాలం అందరూ వెనకడుగు వేశారు.

సింపుల్ గా పెళ్లి జరిగిపోయింది
చెన్నైలోని త్యాగరాజ్ నగర్ లో నివాసం ఉంటున్న రాజశేఖరన్ (40) అనే వ్యక్తి రేఖాను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు. 40 ఏళ్లు అయినా రాజశేఖర్ కు ఇంకా పెళ్లి కాకపోవడంతో అతను వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 14 రోజుల క్రితం వడపళనిలోని మురుగన్ ఆలయంలో పెద్దలు అంగీకారంతో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో రాజశేఖర్, రేఖాల పెళ్లి చాలా సింపుల్ గా జరింది.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
వివాహం చేసుకున్న తరువాత రేఖా ఐదు రోజులు మాత్రమే ఆమె భర్త రాజశేఖర్ ఇంటిలో ఉంది. తరువాత రేఖా ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉంటున్న రేఖా అక్కడి నుంచి రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తోంది. భార్య రేఖాను పుట్టింటి నుంచి తన ఇంటికి పిలుచుకుని వెళ్లడానికి రాజశేఖరన్ అత్తారింటికి బయలుదేరాడు.

ఉరి వేసుకున్న కొత్త పెళ్లికూతురు
అల్లుడు ఇంటికి వస్తున్నాడని వంటలు చెయ్యాలని అనుకున్న ప్రకాష్, గౌరీ దంపతులు మాంసం తీసుకురావడానికి బయటకు వెళ్లారు. తన భర్త రాజశేఖరన్ ఇంటికి వస్తున్నాడని తెలిసిన రేఖా తల్లిదండ్రులు బయటనుంచి ఇంటికి వచ్చేలోపు అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు రేఖా ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

షాకింగ్ విషయాలు చెప్పిన భర్త
వివాహం జరిగిన 14 రోజులకే నవవధువు రేఖా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల విచారణలో కొత్త పెళ్లి కొడుకు రాజశేఖర్ షాకింగ్ విషయాలు చెప్పడంతో అందరూ హడలిపోయారు. రేఖా అనారోగ్యంతో బాధపడుతోందని, అదే విషయం గురించి తనతో చర్చించిందని పోలీసులకు చెప్పాడు.

అసలు ఫస్ట్ నైట్ జరగలేదు
వివాహం జరిగిన రోజు ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేశారని. అదే రోజు రాత్రి నిన్ను సుఖపెట్టడానికి నా శరీరం సహకరించడం లేదని రేఖా తనతో చెప్పిందని భర్త రాజశేఖర్ పోలీసులకు చెప్పాడు. ఇదే విషయంలో రేఖాకు వైద్య పరీక్షలు చేయించడానికి ఇంటికి తీసుకురావాలని తన తండ్రి చెప్పాడని, నేను ఇక్కడికి వచ్చేలోపు తన భార్య ఆత్మహత్య చేసుకుందని రాజశేఖర్ పోలీసులకు చెప్పాడు. కొత్త పెళ్లి కూతురు రేఖా ఆత్మహత్యకు అసలు విషయం తెలుసుకున్న అందరూ చలించిపోయారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications