Marriage: నాలుగు దిక్కుల్లో నలుగురు భర్తలు, ఐదో వాడి కోసం వేటలో ?, మేడమ్ కు 32 ఫోన్ నెంబర్లు !
చెన్నై/మదురై/మన్నార్ గుడి: ఓ యువకుడిని, మహిళకు పరిచం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరు ప్రేమలోపడ్డారు. యువకుడు అతని కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. భార్యకు లక్షల రూపాయల విలువైన బంగారు నగలు చేయించాడు. నెల రోజులు భర్తతో కాపురం చేసిన భార్య మాయం అయ్యింది. భార్య మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంట్లో నగలు, నగదు, పట్టుచీరలు మాయం అయ్యాయని భర్త గుర్తించాడు. ఆమె ఇచ్చిన అడ్రస్ నకిలి అని తెలిసుకున్న భర్త పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు కష్టపడి మాయం అయిన భార్యను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. కిలాడీ లేడీ ఇప్పటి వరకు నలుగురిని పెళ్లి చేసుకుందని, 32 సిమ్ మార్డులు తీసుకుని అనేక మందికి కుచ్చుటోపీ పెట్టిందని వెలుగు చూడటంతో నాలుగో భర్తకు నరాలు పిండేసినట్లు అయ్యింది. పోలీసుల విచారణలో కిలాడీ లేడీ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

అందం చూసి పడిపోయాడు
చెన్నై సిటీలోని తాంబరంలోని రంగనాథపురంలో నటరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ ఫెడ్ డెలవరీ కంపెనీలో నటరాజ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నైలోని ముడిచూర్ ప్రాంతంలోని హాస్టల్ లో ఉంటున్న అభినయా అనే మహిళ నటరాజ్ కు పరిచయం అయ్యింది. అభినయా అందం చూసిన నటరాజన్ ఆమె వలలో పడిపోయాడు.

ప్రియుడికి మాయమాటలు చెప్పింది
అభినయా అక్కడే ఓ బేకరీలో ఉద్యోగం చేసేది. కొంతకాలం తరువాత నటరాజన్, అభినయా ప్రేమలోపడ్డారు. అభినయాను పెళ్లి చేసుకోవాలని నటరాజన్ డిసైడ్ అయ్యాడు. తన తల్లిదండ్రులు చనిపోయారని, తాను హాస్టల్ లో ఉంటున్నానని అభినయా ఆమె ప్రియుడు నటరాజన్ కు మాయమాటలు చెప్పింది.

17 తులాల బంగారు నగలు
కుటుంబ సభ్యులను ఒప్పించిన నటరాజన్ అతని ప్రియురాలు అభినయాను ఆగస్టు నెలలో చెన్నైలోని గుడిలో బంధువులు. స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. నటరాజన్ అతని భార్య అభినయాకు లక్షల రూపాయల విలువైన 17 తులాల బంగారు నగలు చేయించాడు. వివాహం చేసుకున్న తరువాత అభినయా ఆమె భర్త నాటరాజన్ తో అతని ఇంటిలో నెల రోజులు కాపురం చేసింది.

నెల రోజులకే జెండా ఎత్తేసిన భార్య
నెల రోజులు భర్త నటరాజన్ తో కాపురం చేసిన అభినయా తరువాత మంచి రోజు చూసి మాయం అయ్యింది. నటరాజన్ అతని భార్య అభినయా కోసం గాలించడంతో ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంట్లో 17 తులాల బంగారు నగలు, రూ. 20 వేల నగదు, పది పట్టుచీరలు మాయం అయ్యాయని నటరాజన్ గుర్తించాడు. అభినయా ఇచ్చిన మదురైలోని ఇంటి అడ్రస్ నకిలి అని తెలిసుకున్న నటరాజన్ చెన్నైలో పోలీసు కేసు పెట్టాడు.

హాస్టల్ లో తలదాచుకున్న అభినయా
రంగంలోకి దిగిన పోలీసులు అభినయా ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కష్టపడి ఆమె ఆచూకి కోసం గాలించారు. సమ్మెంచేరి సమీపంలోని పాత మమల్లపురం రోడ్డులోని ఓ హాస్టల్ లో తలదాచుకున్న అభినయాను పోలీసులు పట్టుకున్నారు. అభినయా దగ్గర నాలుగు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

నాలుగు దిక్కుల్లో నలుగురు భర్తలు
పోలీసుల విచారణలో అభినయా గురించి దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. కిలాడీ లేడీ అభినయా ఇప్పటి వరకు నలుగురిని పెళ్లి చేసుకుందని వెలుగు చూసింది. వివాహం చేసుకున్న తరువాత అభినయా ఆమె భర్తలతో కొంతకాలం మాత్రమే కాపురం చేసి తరువాత బంగారు నగలు, నగదుతో పారిపోతుందని పోలీసులు విచారణలో వెలుగు చూడటంతో నాలుగో భర్త నటరాజన్, అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ఎలా చేస్తోందంటే ?
2011లో తమిళనాడులోని మన్నార్ గుడికి చెందిన ఓ యువకుడిని అభినయా పెళ్లి చేసుకుంది, వీరికి 8 సంవత్సరాల కుమారుడు ఉన్నాడని పోలీసులు అన్నారు. తరువాత మొదటి భర్తను వదిలేసిన అభినయా మధురైకి చెందిన సెంథిల్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. సెంథిల్ కుమార్ కు దూరం అయిన అభినయా కీళంబాక్కంలోని మరో యువకుడిని పెళ్లి చేసుకుని 10 రోజుల తరువాత అతన్ని కూడా వదిలేసిందని, తరువాత నటరాజన్ ను నాలుగో పెళ్లి చేసుకుందని పోలీసులు చెప్పారు.

అభినయా పేరుతో 32 సిమ్ కార్డులు
అభినయా ఇప్పటి వరకు ఆమె పేరుతో 32 సిమ్ కార్డులు తీసుకుందని, పలువురిని మోసం చేసిన తరువాత ఆ ఫోన్ నెంబర్లు పని చెయ్యుండా చేసి మరో సిమ్ కార్డు వేసుకుంటుందని పోలీసులు అన్నారు. నలుగురిని పెళ్లి చేసుకుని మోసం చెయ్యడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా అనేక మందిని అభినయా మోసం చేసిందని పోలీసులు అన్నారు.

రెండో భర్తకు బెండ్
ఇలా పెళ్లి పేరుతో ముగ్గురిని మోసం చేసిన అభినయా వాటిలో కొన్ని బంగారు నగలు రెండో భర్త సెంథిల్ కుమార్ కు ఇచ్చిందని పోలీసులు అన్నారు. అభినయాను అరెస్టు చేసిన పోలీసులు ఆమె రెండో భర్త సెంథిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని అతన్ని విచారణ చేస్తున్నారు. మొత్తం మీద కిలాడీ లేడీ అభినయా ఇంకా ఎంతమందిని పెళ్లి చేసుకుంది ? అని చెన్నై పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications