వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Marriage: భారీ వర్షాలు, వరద నీటిలో రాగి పాత్రల్లో వెళ్లి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య, వావ్, వాట్ ఏ ఐడియా !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ అలప్పుజ: వరుణుడి కోపానికి దేవభూమి కేరళ విలవిల్లాడుతోంది. భారీ వర్షాల కారణంగా కేరళ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి ఇప్పటి వరకు సుమారు 25 మంది ప్రాణాలు పోగా మరో 20 మంది గల్లంతు అయ్యారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. కేరళలోని అనేక జిల్లాల్లో ఇంటి నుంచి బయటకు రావాలంటే స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

ఇలాంటి సమయంలో భారీ వర్షాలు, వరదలను లెక్క చెయ్యకుండా ఓ యువతి, యువకుడు పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి, ముందుగా ఏ దేవాలయంలో వివాహం చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారో అదే దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మోకాళ్ల లోతు నీళ్లలో మునిగి ఉన్న ఆ గుడిలోకి రాగి పాత్రల్లో వచ్చిన వధూవరులు అదే రాగి పాత్రల్లో కుర్చున్నారు. పెళ్లి కొడుకు రాగి పాత్రలో లేచి నిలబడి ఎదురుగా రాగి పాత్రలో కుర్చుకున్న వధువు మెడలో తాళి కట్టాడు.

ఇలా అనుకున్న ముహూర్తానికి ఈ జంట వారి పెళ్లి సంతోషంగా చేసుకున్నారు. యువతి, యువకుడు వెరైటీగా పెళ్లి చేసుకోవడం, కేరళ టీవీ చానల్స్ ప్రచారం చెయ్యడంతో ఇప్పుడు ఈ పెళ్లి విషయం మీడియాతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Wife: భర్తకు పోర్న్ సినిమాల పిచ్చి, భార్యను అలాగే చెయ్యాలని చెప్పిన ఐటీ కంపెనీ ఎండీ, సీన్ కట్ చేస్తే!Wife: భర్తకు పోర్న్ సినిమాల పిచ్చి, భార్యను అలాగే చెయ్యాలని చెప్పిన ఐటీ కంపెనీ ఎండీ, సీన్ కట్ చేస్తే!

కేరళలో భారీ వర్షాలు

కేరళలో భారీ వర్షాలు

వరుణుడి కోపానికి దేవభూమి కేరళ విలవిల్లాడుతోంది. భారీ వర్షాల కారణంగా కేరళ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి ఇప్పటి వరకు సుమారు 25 మంది ప్రాణాలు పోగా మరో 20 మంది గల్లంతు అయ్యారు. అనేక ఇండ్లు నేలమట్టం కావడంతో చాలా మంది రోడ్డునపడ్డారు.

ముందుగా ఫిక్స్ చేసిన ముహూర్తం

ముందుగా ఫిక్స్ చేసిన ముహూర్తం

కేరళలోని అలప్పుజ జిల్లాలోని తకాజీలో ఆకాష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అలప్పుజ జిల్లాలోని అంబలపుజలో నివాసం ఉంటున్న ఐశ్వర్యకు పెళ్లి చెయ్యాని పెద్దలు నిర్ణయించారు. అక్టోబర్ 18వ తేది సోమవారం (ఈరోజు) పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కేరళలో భారీ వర్షాలు పడటంతో ఆకాష్, ఐశ్వర్య పెళ్లి సవ్యంగా జరుగుతుందా ? అని పెద్దలకు అనుమానం వచ్చింది.

 ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన జంట

ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన జంట

భారీ వర్షాలు పడినా, వరదలు వచ్చినా కూడా అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలని పెళ్లి కూతురు ఐశ్వర్య, పెళ్లి కొడుకు ఆకాష్ డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని ఆకాష్, ఐశ్వర్య వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న తలవాడిలోని ఆ గుడి మోకాలు లోతు నీళ్లలో ఉండటంతో మరో సమస్య వచ్చిపడింది.

పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుది సూపర్ ఐడియా

పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుది సూపర్ ఐడియా

కోవిడ్ నిబంధనల ప్రకారం ఆకాష్, ఐశ్వర్య పెళ్లికి కొద్ది మంది బంధువులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. అయితే భారీ వర్షాల కారణంగా వారు కూడా పెళ్లికి రావడం కష్టం అయ్యింది. పెళ్లికి వచ్చేవారికి వంట చెయ్యడానికి రాగి పాత్రలు తెప్పించారు. ఇప్పుడు అవే రాగి పాత్రలు ఆకాష్, ఐశ్వర్య పెళ్లికి ఉపయోగపడ్డాయి. నీళ్లలో అడుగు పెట్టకుండా రాగి పాత్రల్లో కుర్చుకున్న పెళ్లి కొడుకు ఆకాష్, పెళ్లి కూతురు ఐశ్వర్య మోకాళ్ల లోతులో ముగిని ఉన్న తలవాడిలోని ఆలయంలోకి చేరుకున్నారు.

చుక్క వరద నీరు టచ్ కాకుండా పెళ్లి చేసుకున్నారు

చుక్క వరద నీరు టచ్ కాకుండా పెళ్లి చేసుకున్నారు

మోకాళ్ల లోతు నీళ్లలో మునిగి ఉన్న ఆ గుడిలోకి రాగి పాత్రల్లో వచ్చిన వధూవరులు ఐశ్వర్య, ఆకాష్ అదే రాగి పాత్రల్లో కుర్చున్నారు. పెళ్లి కొడుకు ఆకాష్ రాగి పాత్రలో లేచి నిలబడి ఎదురుగా రాగి పాత్రలో కుర్చుకున్న వధువు ఐశ్వర్య మెడలో తాళి కట్టాడు.

వరద నీటితో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లిబట్టలు తడవకుండా వారి కుటుంబ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా అనుకున్న ముహూర్తానికి ఆకాష్, ఐశ్వర్య వారి పెళ్లి సంతోషంగా చేసుకున్నారు.

శుభకార్యం ఆలస్యం చెయ్యకూడదు

శుభకార్యం ఆలస్యం చెయ్యకూడదు

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల న్యూస్ కవర్ చెయ్యడానికి టీవీ చానల్స్ పోటీపడుతున్నాయి. వరద నీటిలోనే వెళ్లి ఆకాష్, ఐశ్వర్య పెళ్లి చేసుకుంటున్నారని తెలుసుకున్న మలయాళం టీవీ చానల్స్ ఈ రోజు ఆ న్యూస్ కవర్ చేశాయి. ఈ సందర్బంగా నవధంపతులు ఆకాష్, ఐశ్వర్య మీడియాతో మాట్లాడుతూ జీవితంలో ఒకేఒకసారి పెళ్లి చేసుకుంటామని, బ్రహ్మ ముహూర్తంలో నిర్ణయించిన ఈ ముహూర్తానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదరు నిలబడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, దేవుడి దయవల మా పెళ్లి జరిగిపోయిందని ఆకాష్, ఐశ్వర్య మీడియాకు చెప్పారు. చెంగనూరులోని ఓ ఆసుపత్రిలో ఐశ్వర్య, ఆకాష్ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తం మీద ఐశ్వర్య, ఆకాష్ వంటపాత్రల పెళ్లి ఇప్పుడు కేరళతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Marriage: Couple reached wedding pavilion in copper plate without falling into water near Alappuzha in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X