Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Marriage fight: లక్ష్మిపై రూ. 2. 50 కోట్లకు పరువు నష్టం కేసు వేసిన నటి వనిత, నువ్వెంత, నీబతుకెంత ?

చెన్నై/ మదురై: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు విలవిలాడుతుంటే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుని వివాదాలకు కేంద్ర బింధువైన నటి వనిత విజయ్ కుమార్ మరోసారి రెచ్చకెక్కారు. తన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని రూ. 1. 50 కోట్లకు పరువు నష్టం వేసిన లక్ష్మి రామకృష్ణన్ అనే మహిళపై ప్రతికారంగా మరో కోటి రూపాయల ఎక్కువగా రూ. 2. 50 కోట్లకు వినత విజయ్ కుమార్ పరువు నష్టం కేసు వేశారు. ఒకరి మీద ఒకరు పరువు నష్టం కేసులు వేసుకోవడానికి కారణం అయిన యూట్యూబ్ చానల్ నిర్వహకులు ఇది ఎక్కడ తంటారా దేవుడా అంటూ హడలిపోతున్నారు.

 మూడో పెళ్లితో ముల్లోకాల్లో రచ్చ !

మూడో పెళ్లితో ముల్లోకాల్లో రచ్చ !

ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మూడోపెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్న నటి వనిత విజయ్ కుమార్ మీద అనేక మంది విమర్శలు గుప్పించారు. నేను ఏం తక్కువ తిన్నాను అంటూ తన మీద ఆరోపణలు చేస్తున్న వారికి నటి వనిత విజయ్ కుమార్ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తూ వచ్చింది.

 పీటర్ భార్య ఎలిజిబెత్ హెలెన్ కేసు

పీటర్ భార్య ఎలిజిబెత్ హెలెన్ కేసు

వనిత మూడో భర్త పీటర్ పాల్ కు ఇంతకు ముందే వివాహం అయ్యింది. పీటర్ పాట్ తను పెళ్లి చేసుకున్నాడని, చట్టపరంగా తనకు విడాకులు ఇవ్వకుండా అతను వనిత విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకుని తనకు అన్యాయం చేశాడని ఆయన భార్య ఎలిజిబెత్ హెలెన్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తన జీవితాన్ని నాశనం చెయ్యడానికి తన భర్త పీటర్ పాల్, వనిత విజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఎలిజిబెత్ హెలెన్ పోలీసు కేసు పెట్టింది. ఈ వివాదం ఇంకా విచారణలో ఉంది.

 నువ్వెంత అంటే నీ బతుకెంత అంటూ సవాల్

నువ్వెంత అంటే నీ బతుకెంత అంటూ సవాల్

పీటర్ పాల్, వనిత విజయ్ కుమార్, ఎలిజిబెత్ హెలెన్ ల వివాదం తీవ్ర సంచలనానికి దారితీసింది. ఇదే విషయంపై ఓ ప్రైవేట్ యూట్యూబ్ చానల్ నిర్వహకులు నిర్వహించిన చర్చలో ఎలిజిబెత్ హెలెన్ చేసిన ఆరోపణలు ఎదురొంటున్న నటి వనిత విజయ్ కుమార్, లక్ష్మి రామకృష్ణన్ పాల్గొన్నారు. ఆ సమయంలో పీటర్ పాల్, వనిత విజయ్ కుమార్ ల వివాహం విషయంలో జోరుగా చర్చ జరిగి నువ్వెంత అంటే నువ్వెంత, నీ బతుకెంత అంటూ నటి వనిత విజయ్ కుమార్, లక్ష్మి రామకృష్ణన్ ల మధ్య మాటల యుద్దం జరిగింది.

 రూ. 1. 50 కోట్లకు పరువు నష్టం కేసు

రూ. 1. 50 కోట్లకు పరువు నష్టం కేసు

యూట్యూబ్ చానల్ లో జరిగిన చర్చలో నటి వనిత విజయ్ కుమార్, లక్ష్మి రామకృష్ణన్ ల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తన మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందని, తన పరువు బజారున వెయ్యడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ లక్ష్మి రామకృష్ణన్ నటి వనిత విజయ్ కుమార్ పై రూ. 1. 50 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేసింది.

 మర్యాదగా రూ. 2. 50 కోట్లు ఇవ్వు

మర్యాదగా రూ. 2. 50 కోట్లు ఇవ్వు

నా మీదే నువ్వు పరువు నష్టం కేసు దాఖలు చేస్తావా ? నువ్వెంత ? నీ బతుకెంత ? నా మీద ఆరోపణలు చేసిన నువ్వే నాకు రూ. 2. 50 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నటి వనిత విజయ్ కుమార్ సాటి మహిళ లక్ష్మి రామకృష్ణన్ మీద రూ. 2. 50 కోట్లకు పరువు నష్టం కేసు పెట్టారు.

నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీదే నువ్వు పరువు నష్టం కేసు వేస్తావా ? అంటూ లక్ష్మి రామకృష్ణన్ పై నటి వనిత విజయ్ కుమార్ మండిపడుతోంది.

Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty Shares Picture Of Gratitude List From Sushant's Dairy
     కరోనా కాలంలో వనిత తలనొప్పి

    కరోనా కాలంలో వనిత తలనొప్పి

    తనకు రూ. 2. 50 కోట్లు పరువు నష్టం చెల్లించి క్షమాపణలు చెబితే కేసు వెనక్కి తీసుకుంటానని నటి వనిత విజయ్ కుమార్ లక్ష్మి రామకృష్ణన్ కు నోటీసులు పంపించారు. అసలే కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో క్షణం తీరికలేకుండా కష్టపడుతున్న చెన్నై సిటీ పోలీసులకు నటి వనిత విజయ్ కుమార్ ఇప్పుడు మరో తలనొప్పిగా తయారైయ్యిందని స్వయంగా పోలీసులే తలలు పట్టుకుంటున్నారు. నటి వనిత విజయ్ కుమార్ మీద నిత్యం ఎవరో ఒకరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+