వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు ఆసక్తికర తీర్పు: ప్రియుడు అత్యాచారం చేశాడని వివాహిత కేసు పెట్టడం తగదు

|
Google Oneindia TeluguNews

పెళ్లైన మహిళ, మూడో వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేస్తే అది చెల్లదని ఆసక్తికర తీర్పు ఇచ్చింది బాంబే హైకోర్టు.

వివరాల్లోకి వెళితే... జూన్ 2013లో సచిన్ పొటుడే అనే వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసును నమోదు చేశారు వార్దా పోలీసులు. అయితే ఆ మహిళకు అప్పటికే మరొకరితో వివాహమై ఒక బిడ్డ కూడా ఉంది. అయితే సచిన్ తనకు పరిచయమయ్యాక ఆయనతో సన్నిహితంగా మెలిగింది. భర్తకు దూరంగా ఉంటూ సచిన్‌తో దగ్గరైంది. సచిన్‌తో సన్నిహితంగా ఉడటం ఆయన భార్య దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Married woman can’t claim lover raped her

ఇక అప్పటి నుంచి సచిన్ తన భార్యతోనే ఉంటున్నాడు. ఇది జీర్ణించుకోలేకపోయిన సదరు మహిళ... సచిన్ తనను పట్టించుకోవడం లేదని తలచి వార్దా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సచిన్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ బాంబే హైకోర్టును 2014లో సచిన్ ఆశ్రయించాడు. విచారణ చేసిన డివిజన్ బెంచ్... పెళ్లైన మహిళ తన భర్తతో తప్ప ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోరాదని వ్యాఖ్యానించింది. మరొక వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని తప్పుబట్టింది. విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకోవడాన్ని తప్పుగా పరిగణించిన కోర్టు... కేసును కొట్టివేసింది.

English summary
The Bombay high court has said that a married woman cannot accuse a third person of rape, on the grounds that he induced her to have physical relationship with him under false pretext of marriage and struck down a case of rape against a 30-year-old Wardha resident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X