వివాహితపై గ్యాంగ్ రేప్: కొడుకుపై ఫిర్యాదుకు బాలికపై కాల్పులు
రాజ్‌గడ్/ గోరఖ్‌పూర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై దారుణం జరిగింది. సారంగ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కచ్చిఖేడీలో ముగ్గురు వ్యక్తులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై వారు ఆ దారుణానికి ఒడిగట్టాడుర. సబ్ ఇన్‌స్పెక్టర్ నరేష్ రావత్ ఆ విషయం చెప్పారు.
నిందితులను నజ్జు అజీమ్‌లుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఆ ఇద్దరితో పాటు మరో వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అరిస్తే చంపేస్తామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు రావత్ చెప్పారు.

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ నడివయస్సు వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆమె క్లాస్‌మేట్ ఆ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. అతనిపై బాలిక ఫిర్యాదు చేసింది. దాంతో ఆగ్రహించిన ఆ క్లాస్‌మెంట్ తండ్రి బాలికపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఆమెకు రెండు బుల్లెట్ గాయాలు అయ్యాయి.
ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన క్లాస్‌మేట్‌పై బాలిక పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పాఠశాల యాజమాన్యం ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసింది. బుధవారంనాడు ఆ బాలుడి తండ్రిని పాఠశాల యాజమాన్యం పిలిచింది.
పాఠశాలలో సమావేశం జరుగుతండగా బాలుడి తండ్రి త్రిభువన్ త్రిపాఠీ పిస్టల్ తీసి బాలికపై కాల్పులు జరిపాడు. ఆమె భుజంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఉపాధ్యాయులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. త్రిభువన్‌ను అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications