ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్లో చలపతి సహా 20 మంది నక్సల్స్ మృతి-బిగ్ సక్సెస్ అన్న అమిత్ షా..!
ఛత్తీస్ ఘడ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గరియా బండ్ ప్రాంతంలో ఇవాళ ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూంబింగ్ లో ఉన్న భద్రతా బలగాలకూ, మావోయిస్టులకూ మధ్య భారీ ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి.ఇందులో 20 మంది నక్సల్స్ చనిపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ విజయంగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు వెంబడి ఉన్న మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిన్న అర్థరాత్రి నుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా , ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజి) సంయుక్త భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు.
ఈ ఆపరేషన్ లో ఏపీకి చెందిన చిత్తూరు జిల్లా వాసి జయరామిరెడ్డి అలియాస్ చలపతి కూడా చనిపోయాడు. అతనిపై కోటి రూపాయల రివార్డు ఉంది. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ తర్వాత భారీ ఎత్తున మావోయిస్టుల నుంచి ఆయుధ సామాగ్రి, మావోయిస్టు సాహిత్యం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. నక్సల్ రహిత భారత్ దిశగా ఇది పెద్ద అడుగు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు.
Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…
— Amit Shah (@AmitShah) January 21, 2025
మరోవైపు నిన్న తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోలు చనిపోయారు. అలాగే సీఆర్పీఎఫ్ ఎలైట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్‌కు చెందిన ఒకరు గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని ఫిరూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న మెయిన్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్ జరిగినట్ల గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు.












Click it and Unblock the Notifications