వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం: 8 మంది మృతి, పది మందికిపైగా గాయాలు

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జబల్‌పూర్‌లోని దామోహ్ నాకా సమీపంలోని న్యూ లైఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కాగా, మరణించిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు.

 Massive Fire Breaks Out At Hospital In Jabalpur, Madhya Pradesh, Eight Dead

"నలుగురు వ్యక్తులు మరణించారు. ఇది భారీ అగ్నిప్రమాదం, ఆసుపత్రిలో చిక్కుకున్న వారందరినీ మా బృందాలు రక్షించాయి. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు" అని జబల్‌పూర్ CSP అఖిలేష్ గౌర్‌ మీడియాకు తెలిపారు.

ప్రాణాలు కోల్పోయిన నలుగురి బంధువులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 సాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

"జబల్‌పూర్‌లోని న్యూ లైఫ్ హాస్పిటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో విలువైన జీవితాల అకాల మరణ వార్తతో హృదయం బాధగా ఉంది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సీఎం చౌహాన్ చెప్పారు.

"ఇది చాలా బాధాకరమైన సంఘటన, మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని మాజీ సీఎం కమల్ నాథ్ తెలిపారు.

English summary
Massive Fire Breaks Out At Hospital In Jabalpur, Madhya Pradesh, Eight Dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X