భోపాల్‌: ఆరంతస్తుల ప్రభుత్వ కార్యాలయాల్లో భారీ అగ్నిప్రమాదం, రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ విభాగాల కార్యాలయాలు ఉన్న సత్పురా భవన్ భవనంలోని మూడవ అంతస్తులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటలు ఎగిసిపడుతూ ఇతర అంతస్తులకు కూడా వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

20కిపైగా ఫైరింజిన్లు చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, మంటలు చల్లారకపోవడంతో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహాయం కోరారు అధికారులు. దీంతో మిగ్-17 హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. ఆర్మీ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని అనేక కీలకమైర ఫైల్స్ ఈ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైనట్లు తెలుస్తోంది.

 Massive Fire In 6-Storey Building Housing Govt Offices In Bhopal, IAF Choppers Called In

సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదాన్ని గుర్తించి వెంటనే భవనంలోని అధికారులు, సిబ్బంది, ఇతర ప్రజలంతా బయటికి రావడంతో ప్రాణ నష్టం తప్పింది. భవనంలోని ఫర్నీచర్, డాక్యుమెంట్లు, ఫైల్స్ మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వైమానిక దళ సహాయం కోరుతూ ముఖ్యమంత్రి శివరాజ్.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు సీఎంవో తెలిపింది. ఈ క్రమంలో పలు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. తప్పక సాయం చేస్తామంటూ కేందరమంత్రి.. సీఎంకు ఈ మేరకు హామి ఇచ్చినట్లు తెలిసింది. హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం శివరాజ్ మాట్లాడి, ఘటనపై సాయం కోరినట్లు సమాచారం.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. అన్ని వనరులను సమీకరించామని, ప్రస్తుతం 22 ఫైర్ ఇంజిన్లు, 30-40 ట్యాంకర్లు డోసింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని చెప్పారు. భవనంలో చాలా ఫైళ్లు నిల్వ ఉండడంతో మంటలు వ్యాపించాయని, దట్టమైన పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారని చెప్పారు. అగ్ని సాంద్రత చాలా ఎక్కువగా ఉందన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సింగ్ తెలిపారు.కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+