మాకోసం రండి, సీఎం పీఠమెక్కిస్తాం:రజనీకాంత్ ఫ్యాన్స్
చెన్నై: సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే తగిన సమయమని, దయచేసి మా కోసం, ప్రజల కోసం రాజకీయాలలోకి రావాలని తమిళనాడు వేలూరు జిల్లాలో అభిమానులు ముక్తకంఠంతో గళమెత్తారు. అభిమానులుగా రజినీకాంత్‌కు మేం అండగా ఉంటామని, ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.
రజనీకాంత్ అభిమానులు 'మలరట్టుమ్ మణిద నేయం' పేరిట రజనీ అభిమానులు ఆదివారం రాత్రి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ సభలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్నాటకల నుంచి కూడా అభిమానులు తరలి వెళ్లారు. ఈ సభ రాజకీయ పార్టీలు నిర్వహించే సభను మించిపోయింది. ఈ సభలో రజనీకాంత్ స్నేహితుడు రాజాబహదూర్ మాట్లాడుతూ.. రజనీ తన స్నేహితుడు అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు.
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని సమయంలో అభిమానులు చూపిన ప్రేమే ఆయనను తిరిగి 65 ఏళ్ల వయస్సులోను హీరోగా రాణింప చేస్తోందన్నారు. నటుడు కరుణాస్ మాట్లాడుతూ.. టరజనీ సార్! అభిమానుల కోరిక తీర్చండి' అన్నారు. తద్వారా రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications