యోగిపై ఎందుకంత ప్రేమ?..ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన మాయ
ఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎలక్షన్ కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ ఈసీ మాయావతి ప్రచారంపై 48గంటలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటల నిషేధం విధించింది. అయితే నిషేధం సమయంలో యోగి నిబంధనలు ఉల్లంఘించినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడంలేదని మాయావతి ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం కష్టమేనని బెహన్ జీ అభిప్రాయపడ్డారు.
బీజేపీ విషయంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మాయావతి ఆరోపిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయాలు సందర్శిస్తున్నారని, దళితుల ఇళ్లలో భోజనాలు చేస్తూ మీడియా కవరేజ్, పబ్లిసిటీ పొందుతున్నారని ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. యోగి నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఈసీ ఆయనపై ఎందుకంత ప్రేమ చూపుతోందని మయావతి ప్రశ్నించారు.













Click it and Unblock the Notifications