"మోడీకి మధ్యంతర ఎన్నికలకు వెళ్లేంత దమ్ముందా?: నోట్ల రద్దుపై అదో బోగస్ సర్వే!"

నోట్ల రద్దుపై ప్రజల్లో ఉన్న అసలు అభిప్రాయం తెలియాలంటే.. లోక్ సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని.. మోడీకి అంత దమ్ముందా అని సవాల్ విసిరారు మాయావతి.

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం మాత్రం.. దేశ ప్రజలంతా ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని సర్వే లెక్కలను చూపిస్తున్నారు. సర్వేపై అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు అదో బోగస్ సర్వే అని కొట్టిపారేస్తున్నాయి.

తాజాగా బీఎస్సీ అధినేత్రి మాయావతి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుపై బీజేపీ సర్వే బోగస్ అని, స్పాన్సర్డ్(డబ్బులు పెట్టి మేనేజ్ చేశారని) మండిపడ్డారు. నోట్ల రద్దుపై ప్రజల్లో ఉన్న అసలు అభిప్రాయం తెలియాలంటే.. లోక్ సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని.. మోడీకి అంత దమ్ముందా అని సవాల్ విసిరారు మాయావతి.పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాయావతి.

Mayawati takes a dig on PM Narendra Modi again

దేశంలోని ప్రజలంతా కష్టాలు పడుతుంటే మోడీ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని విమర్శించారు. ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్ దుర్ఘటనకు మోడీనే బాధ్యుడని ఆరోపించారు మాయావతి. బుల్లెట్ ట్రెయిన్ టెక్నాలజీ మీద పెడుతున్న పెట్టుబడి పట్టాల నిర్వహణ మీద పెట్టుంటే.. ఈ ప్రమాదం చోటు చేసుకోకబోయేదని చెప్పారు.

ఇక పార్లమెంటు ఉభయ సభల్లోను పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్ష పార్టీలు నిరసన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, విపక్షాల నిరసనల నడుమ లోక్ సభ గురువారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని రాజ్యసభకు వచ్చి స్పందించాలని ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నడుమ రాజ్యసభ కూడా మధ్యాహ్నాం 12గం.లకు వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+