ఎంసీడీ హౌస్ తన్నులాట: బీజేపీనేతలపై పోలీస్‌స్టేషన్‌లో ఆప్ ఫిర్యాదు.. కోర్టుకు వెళ్తున్న బీజేపీ!!
ఎంసీడీ హౌస్ దాడులపై బీజేపీనేతలపై పోలీస్‌స్టేషన్‌లో ఆప్ ఫిర్యాదు చేస్తుంది. ఇక స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై బీజేపీ కోర్టుకు వెళ్తుంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో చోటు చేసుకున్న దాడుల పర్వం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎం సి డి లో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఇక తామే గెలిచినట్టు ఆప్ నేత సౌరబ్ భరద్వాజ ప్రకటించారు. తమ పార్టీకి మొత్తం 138 ఓట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
బిజెపి కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్ పాల్పడినట్టు కూడా ఆయన తెలిపారు. మొత్తం బిజెపికి చెందిన ఐదుగురు సభ్యులు ఆప్ కు ఓట్లు వేశారని ఆయన పేర్కొన్నారు. ఇక ఆఫ్ సభ్యుడు ఒకరు బిజెపిలో చేరడంతో ఆ బలం 133 కి తగ్గిందని, ఇప్పటికే ఐదుగురు బిజెపి సభ్యులు తమకు ఓటు వేయడంతో 138 ఓట్లతో తాము విజయం సాధించామని ప్రకటించారు.

ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తన్నుకున్న బీజేపీ, ఆప్ నేతలు
అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో తామే గెలిచామని ఆప్ నేతలు చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం ఒప్పుకోకుండా గొడవకు దిగింది. ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి ముగ్గురు ఆప్ సభ్యులు, ముగ్గురు బిజెపి సభ్యులు ఎన్నికయ్యారు అని చెప్పారని ఆప్ తామే గెలిచినట్టు తప్పుడు ప్రకటన చేస్తుందని బిజెపి ఎదురుదాడికి దిగింది.
ఇక మరోవైపు ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించడంతో సభలో బాహాబాహీ చోటుచేసుకుంది. బిజెపి, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడి తన్నుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వెంటనే అడ్డుకోవాల్సి వచ్చింది.

పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేతలపై ఆప్ ఫిర్యాదు.. ఆపై పోలీస్ కమీషనర్ ను కలవనున్న ఆప్
ఇక ఎం సి డి హౌస్ లో నిన్న జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై దాడి చేసిన బీజేపీ కౌన్సిలర్ల పై కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు . కొత్తగా ఎన్నికైన ఢిల్లీ మేయర్ షెల్లి ఒబెరాయ్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సారిక చౌదరి, అషూ ఠాగూర్ కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
ఎం సి డి హౌస్ లో చోటు చేసుకున్న గందరగోళం, ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా సభ్యులపై శారీరకంగా దాడి చేసిన బిజెపి కౌన్సిలర్ల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఆపై నేడు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాను కూడా ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ కలవనున్నట్టు పేర్కొన్నారు.

తనపై బీజేపీ నేతలు దాడి చేశారన్న ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్
బిజెపి సభ్యులు తమపై దాడి చేసిన ఘటనను ప్రజాస్వామ్యం యొక్క చీకటి రోజుగా అభివర్ణించిన ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ బిజెపికి చెందిన రవి నేగి, అర్జున్ మార్వా, చందన్ చౌదరి తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని సభ్యులు గ్రహించిన తర్వాత నేతలు దాడికి పాల్పడ్డారని ఢిల్లీ మేయర్ అన్నారు. తనను ఎం సి డి హౌస్ నుంచి బయటకు తీసుకు వెళుతుండగా బిజెపి కౌన్సిలర్ అర్జున్ మార్వా తమపై దానికి పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మేయర్ ఆరోపిస్తున్నారు.
ఇక స్టాండింగ్ కమిటీ ఎన్నికలను ఆ రోజుకు రద్దు చేసినట్టు ప్రకటించిన తర్వాత నేడు బిజెపి కౌన్సిలర్ల పై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తున్నారు.

నేడు కోర్టును ఆశ్రయించనున్న బీజేపీ
ఇదిలా ఉంటే మళ్లీ ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తుంటే, ఎన్నికలను నిలిపివేయాలని బిజెపి ఈ రోజు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికల వివాదం ఆప్ బీజేపీ నేతలకు ముందు ముందు ఎటువంటి పరిస్థితులకు కారణం అవుతుందో తెలియాల్సి ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications