కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం వెనుక మెడికల్ మాఫియా? అనుమానాలెన్నో!

కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అత్యంత అమానుషమైన ఈ నేరంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతున్నాయి .ఈ కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది అంటే ఈ కేసు తీవ్రత ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

వైద్యురాలి హత్యాచారం కేసులో అన్నీ అనుమానాలే
ఇప్పటికే ఈ కేసు ను సిబిఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలో యువ వైద్యురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో ప్రారంభమైన ఈ కేసు ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించే ప్రయత్నాలు చేసే దాకా వెళ్ళింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు ఆసుపత్రి కళాశాల యజమాన్యం ఎందుకు కేసును ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారన్నది మొదటి ప్రశ్న.

Medical mafia behind Kolkata doctor rape murder All suspicions about this crime

ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా
జూనియర్ డాక్టర్ ది ఆత్మహత్య అనే చిత్రీకరించే ప్రయత్నం చేసిన కాలేజీ ప్రిన్సిపాల్ వ్యవహార శైలి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జరిగిన జాప్యం వరకు ఇలా అన్ని అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో పాటు టిఎంసి శ్రేణులు చేసినటువంటి ఆందోళనలు నిరసనలు ఈ కేసు పైన మరింత అనుమానాలకు కారణంగా మారాయి.

నేరం జరిగిన చోట సాక్ష్యాధారాలు ధ్వంసం
టిఎంసి పార్టీకి చెందిన అల్లరిమూకలు వైద్యుల శాంతియుత నిరసనకు అంతరాయం కలిగించి ఆసుపత్రిలోకి ప్రవేశించి ముఖ్యమైన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, ఇక పోలీసులు ఆధారాలు ధ్వంసం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా పలు అనుమానాలకు కారణంగా మారింది. అతి తక్కువ ఆధారాలను మాత్రమే సేకరించిన పోలీసులు ఆఖరికి సీసీటీవీ ఫుటేజ్ లు కూడా సేకరించలేకపోవడం సాక్షాలను తారుమారు చేసే చర్యలలో భాగమే అన్న అనుమానాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.

దీని వెనుక ఉన్నది ఎవరు?
ఇక నేరం జరిగిన డిపార్ట్మెంట్లో హఠాత్తుగా మెయింటెనెన్స్ వర్క్ ఎందుకు జరిగింది. బాధితురాలి మృతదేహాన్ని తల్లిదండ్రులకు మూడు గంటలు ఆలస్యంగా ఎందుకు చూపించారు? అసలు దీనికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఈ దారుణం వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అన్న ప్రశ్నలు ప్రజలలో పదేపదే ఉత్పన్నమవుతున్నాయి.

మెడిసిన్ మాఫియా పై అనుమానాలు
ఈ కేసులో అరెస్టు అయిన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ ఘటనకు బాధ్యుడా లేక ఇంతకంటే ఏదైనా పెద్ద కుట్ర అక్కడ జరిగిందా? నిజంగానే బయట చర్చ జరుగుతున్నట్టు మెడిసిన్ మాఫియా అక్కడ ఏమైనా యువ వైద్యురాలి మరణానికి కారణమైందా? అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఓవైపు సిబీఐ మరోవైపు సుప్రీంకోర్టు రంగంలోకి దిగిన నేపథ్యంలో ఈ కేసులో ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి ఉత్కంఠను కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+