ఆ కుక్క బతికేవుంది: విసిరేసిన మెడికో అరెస్ట్(ఫొటో)

Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇటీవల సోషల్ మీడియాలో మేడపై నుంచి ఓ మెడికల్ విద్యార్థి ఓ కుక్కను ఎత్తైన భవనంపై నుంచి కిందకు విసిరేసిన వీడియో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో కిందపడిన కుక్క అదృష్టవశాత్తు చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బతికిబయటపడింది. దాని కాలికి గాయమైంది.

ఈ మేరకు శ్రవణ్‌ కృష్ణ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో చాలా మందికి నెటిజన్లు, జంతు ప్రేమికులు ఊపిరిపీల్చుకున్నారు. కుక్క పిల్ల తమ వద్దే క్షేమంగా ఉందని చెప్పాడు.

Also Read: శాడిస్ట్ డాక్టర్: కుక్కను ఐదో అంతస్థు నుంచి....(వీడియో)

కాలికి గాయమవడంతో నడవలేకపోతోందని, వైద్య చికిత్స అందించినట్లు తెలిపాడు. ఇప్పటికీ కుక్క పిల్ల తోక ఊపుతూనే ఉంది, అది నా హృదయాన్ని కలిచివేసిందని తన ఫేస్‌బుక్ ద్వారా శ్రవణ్ పేర్కొన్నాడు. కాగా, అతని పోస్ట్‌కు ఇప్పటికే 18వేల లైక్‌లు, 6,600 పైగా షేర్లు వచ్చాయి.

Medical student who flung dog off rooftop released on bail

కుక్కను విసిరేసిన నిందితుడి అరెస్ట్

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు గౌతమ సుదర్శన్‌ను, ఆ ఘటనను వీడియో తీసిన గౌతమ్ స్నేహితుడు ఆశీష్ పాల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండంతస్తుల భవనంపై నుంచి కుక్కపిల్లను కిందపడేసిన గౌతమ్‌ ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

గౌతమ్‌ కుక్కపిల్లను కిందపడేస్తుండగా వీడియో తీసిన ఆశిశ్‌ పాల్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారిని శ్రీపెరంబుదూర్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. రూ. 10వేల పూచీకత్తుపై వారిద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after the disturbing video of a dog being flung from the terrace of a four storey apartment triggered outrage, Chennai city police picked up the two suspects, both medical students, from their native towns on Tuesday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి