Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ajmer Dargah: తేనెతుట్టె కదిపిన మాజీ సీజేఐకి థ్యాంక్స్-అజ్మీర్ దర్గా నోటీసులపై మొహబూబా..!

రాజస్థాన్ లోని అత్యంత పురాతన అజ్మీర్ దర్గా కింద శివాలయం ఉందంటూ హిందూ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ స్థానిక కోర్టు దర్గాతో పాటు కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు పంపడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాజస్థాన్ కోర్టు ఉత్తర్వులపై రాజకీయ పార్టీలు సైతం మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా తీవ్రంగా స్పందించారు.

రాజస్థాన్ కోర్టు ఇచ్చిన నోటీసులు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, మతపరమైన ఏకీకరణకు దారి తీసేలా ఉన్నాయని మొహబూబూ ముఫ్తీ అభిప్రాయపడ్డారు. "భారత మాజీ ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు, పండోర పెట్టె తెరవబడింది, ఇది మైనారిటీ మత స్థలాల గురించి వివాదాస్పద చర్చకు దారితీసింది. 1947లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ, ఆయన తీర్పు ఈ సర్వేలకు మార్గదర్శిగా మారింది. తద్వారా హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. " అంటూ మెహబూబా ట్వీట్ చేశారు.

Mehbooba mufti thanks to former cji for opening pandora box in wake of notices to ajmer dargah

రాజస్థాన్ లో చారిత్రక అజ్మీర్ దర్గా కింద శివాలయం ఉందని, అక్కడ సర్వే చేపట్టి తమకు పూజలకు అనుమతి ఇవ్వాలంటూ హిందూసేన సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ పై రాజస్థాన్ కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే గతంలో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత 1947 నాటికి ఉన్న ప్రార్దనా స్థలాల యథాతథ స్దితి కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.కానీ తాజాగా కింది స్థాయి కోర్టులు మధుర, జ్ఞానవాపి, సంభాల్ వంటి చోట్ల మసీదుల్ని, దర్గాలను సర్వేలు చేసేందుకు అనుమతులు ఇస్తున్నాయి. వీటిని సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టకపోవడంపై ముస్లిం వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+