హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Metro: సీఎం దెబ్బకు మైండ్ బ్లాక్, తమాషాలు చేస్తారా ?, కాంట్రాక్టర్, ఇంజనీర్లు ?, దెబ్బకు సీరియస్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని నాగవర సమీపంలోని హెన్నూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కూలి తల్లీ, బిడ్డ మృతి చెందిన ఘటనలో బీఎంఆర్‌సీఎల్‌లోని ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. దీంతోపాటు ఇంజినీర్లపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. కాంట్రాక్ట్ పని చేస్తున్న ఓ ప్రముఖ కంపెనీ అధినేతపై క్రిమినల్ కేసు పెట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. .

బెంగళూరులో మెట్రో పిల్లర్‌ కుప్పకూలి తల్లీ, బిడ్డ దుర్మరణం చెందిన దుర్ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులెని అధికార నివాసం కృష్ణాలో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ అంజుమ్ పర్వేజ్, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి, డీసీపీలతో ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సమావేశమయ్యారు.

Wife: పుట్టింటిలో భార్య, కూతుర్ని కాపురానికి పంపించలేదని అత్తను అల్లుడు ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ !Wife: పుట్టింటిలో భార్య, కూతుర్ని కాపురానికి పంపించలేదని అత్తను అల్లుడు ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ !

 Metro train pillar collapse, death of mother and son, sensational decision of Karnataka CM Basavaraj Bommai.

ఈ ఘటనపై నిర్లక్షంగా పనులు చేస్తున్న అధికారులను కు సీఎం వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే టెండర్ దక్కించుకున్న కంపెనీని బ్లాక్ లిస్టులో చేర్చాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆదేశించారు.

బెంగళూరులో మెట్రో పిల్లర్ పడి మృతి చెందిన నేపథ్యంలో.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులతో జరిగిన సమావేశంలో చెప్పానని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు. కాంట్రాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కాంట్రాక్టు కంపెనీపై మీద కేసు పెట్టమని చెప్పారు. రూ. 20 లక్షల పరిహారం మెట్రో అధికారులు అందజేస్తారని, ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించామని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?

హెన్నూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కూలిన ఘటనలో మరణించిన కుటుంబానికి రూ. 20 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని బీఎంఆర్‌సిఎల్‌ ప్రకటించింది. ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తెలిపారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను కూడా మెట్రో కార్పొరేషన్ భరిస్తుంది. అంతేకాకుండా సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఐఐఎస్‌ఈని కర్ణాటక ప్రభుత్వం సూచించింది.

మెట్రో రైలు పిల్లర్‌ కూలిన ఘటనపై గోవిందపురం పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సైట్ ఇంజనీర్, మెట్రో కాంట్రాక్టర్, సైట్ ఇంఛార్జి ఆఫీసర్, బీఎంఆర్‌సీఎల్ అధికారులతోపాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన తేజస్విని భర్త లోహిత్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Metro train pillar collapse, death of mother and son, sensational decision of Karnataka CM Basavaraj Bommai, FIR against contractor etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X